English   

 ఐ డోంట్ నో.. ఎక్క‌డో విన్న‌ట్లుందే..!

I-Dont-Know-song
2018-04-02 16:59:09

భ‌ర‌త్ అనే నేనులో రెండో పాట విడుద‌లైంది. ఐ డోంట్ నో అంటూ సాగిపోయే పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాసాడు. ఇక దేవీ శ్రీ ప్ర‌సాద్ ఎప్ప‌ట్లాగే త‌న ఎన‌ర్జిటిక్ మ్యూజిక్ తో ర‌ప్ఫాడించాడు. ఈ పాట కోసం ప్ర‌త్యేకంగా ముంబై నుంచి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, హీరో అయిన ఫ‌ర్హాన్ అక్త‌ర్ ను రప్పించాడు దేవీ. ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ వాయిస్ తో ఈ పాట‌కు మ‌రింత అందం వ‌చ్చేసింది. ఈ ఐ డోంట్ నో పాట మ‌హేశ్ వ్య‌క్తిత్వాన్ని గురించి చెబుతుంది. ఈ పాట స‌రిగ్గా వింటే ఇందులో మ‌హేశ్ కారెక్ట‌ర్ ఏంట‌నేది అర్థ‌మైపోతుంది. పాట‌లో ఇంగ్లీష్ ప‌దాలు మ‌రీ ఎక్కువైపోయాయి కానీ ఈ పదాల‌తోనే జీవిత సారాన్ని మొత్తం చెప్పేసాడు రామ‌జోగ‌య్య శాస్త్రి. అయితే ఈ పాటలోని ట్యూన్ మాత్రం వెంక‌టేశ్ మ‌ల్లీశ్వ‌రి సినిమాలోని నువ్వెంత అంద‌గ‌త్తెవైనా గానీ అనే పాట‌ను గుర్తు చేస్తుంది. అప్ప‌ట్లో కోటి సంగీతం అందించిన ఈ పాటే ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను పాట‌లో గుర్తొస్తుంది. మ‌రీ గిటార్ ట్యూన్ అయితే ప‌క్కాగా గుర్తొస్తుంది. అయితే లిరిక్స్ తో ఈ పాట‌ను పూర్తిగా మాయ చేసాడు శాస్త్రి. ద‌ర్శ‌కుడు కొర‌టాల‌ చెప్పిన సంద‌ర్భాన్ని చ‌క్క‌గా అర్థం చేసుకుని అద్భుతంగా రాసాడు. యూనివర్స్ అనే ఎన్ సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్దీ వుంటాయి ఎన్నెన్నో… ఆర్ట్ అఫ్ లివింగ్ అంటే ఆర్ట్ అఫ్ లెర్నింగ్ అంతే.. నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో.. ఐ డోంట్ నో.. ఓన్లీ వన్ థింగ్ ఐ నో.. దేర్ ఈజ్ సొ మచ్ టు నో అంటూ సాగే ఈ పాట‌లో చాలా ఇన్ స్పిరేష‌న్ ఉంది. ఈ పాట ఒక్క‌సారి వింటే సినిమాలో మహేష్ పాత్ర వ్య‌క్తిగత జీవితం గురించి తెలిసిపోతుంది. జాలీగా లైఫ్ ఎంజాయ్ చేసే మహేశ్ వ‌చ్చి సిఎం కుర్చీలో కూర్చుంటాడు. ఈ చిత్రం ఎప్రిల్ 20న విడుద‌ల కానుంది. చూడాలిక‌.. భ‌ర‌త్ అనే మ‌హేశ్ ఎన్ని రికార్డు ల‌కు చెక్ పెడ‌తాడో ఈ చిత్రంతో. 

More Related Stories