English   

మ‌హేశ్ కొనేసాడు.. కొర‌టాల అమ్మేసాడు..

mahesh-ban

ఇండ‌స్ట్రీలో ఓ క్రేజీ కాంబినేష‌న్ వ‌స్తుందంటే చాలు అంద‌రి క‌ళ్లు ఆ సినిమాపైనే ఉంటాయి. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను కూడా ఇలాంటి కాంబినేష‌నే. ఈ క‌ల‌యిక‌లో మూడేళ్ల కింద వ‌చ్చిన శ్రీ‌మంతుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నింటినీ తుడిచేసింది. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ అదే కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో భ‌ర‌త్ అనే నేనుపై కూడా అంచ‌నాలు ఆకాశ‌మంత ఎత్తులో ఉన్నాయి. మ‌హేశ్ బాబు వ‌ర‌స ప్లాపుల్లో ఉన్నా కూడా థియెట్రిక‌ల్ బిజినెస్ మాత్రం అదిరిపోయేలా జ‌రుగుతుంది. ఈ చిత్ర బిజినెస్ 80 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంద‌ని అంచ‌నా. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ సినిమా చూసి మ‌హేశ్ బాబు ఫుల్ ఖుషీ అయ్యాడ‌ని తెలుస్తుంది. ఆయ‌న‌తో పాటు కొర‌టాల కూడా చాలా సంతృప్తిగా ఉన్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. 

ఇలాంటి సినిమాను బ‌య‌టి వాళ్ల‌కు అమ్మితే వాళ్లే క‌దా లాభ‌ప‌డేది మ‌నం కాదుగా అని ముందుగానే ఈ చిత్ర రైట్స్ కొర‌టాల‌, మ‌హేశ్ తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే కొర‌టాల నైజాం రైట్స్ తీసుకున్నాడు. ఇక మహేష్ కూడా కొన్ని ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాడ‌ని తెలుస్తుంది. గ‌తంలో శ్రీ‌మంతుడు సినిమాను కూడా ఇలాగే తీసుకున్నాడు మ‌హేశ్. ఆ సినిమాకు స‌హ నిర్మాత‌గా కూడా ఉన్నాడు. ఇప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్ గా మారాడు. ఎప్రిల్ 20న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి ఇంత న‌మ్మ‌కంగా ఈ చిత్ర రైట్స్ తీసుకుంటున్నారు చిత్ర‌యూనిట్. వాళ్ల న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలిక‌..!

More Related Stories