English   

ఈ ఏజ్ లో ఏంటో ఈ ప‌నులు..?

Mahesh-Babu

ఎవ‌రి కోసం ఈ టైటిల్ అనుకుంటున్నారా..? మ‌న హీరోల కోస‌మే ఇది. ఇప్పుడు వీళ్లు చేస్తోన్న ప‌నులు చూసి ఇదే అనిపిస్తుంది. ఎన్టీఆర్-మ‌హేశ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇప్పుడు త‌మ ఏజ్.. ఇమేజ్ మ‌రిచిపోయి పుస్త‌కాలు ప‌డుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల్లో స్టూడెంట్స్ గా క‌నిపిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి సినిమా కోసం మ‌హేశ్.. త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌లో ఎన్టీఆర్ విధ్యార్థులుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం వీరి కాలేజ్ సీన్స్ నే చిత్రీక‌రిస్తున్నారు ఇద్ద‌రు ద‌ర్శ‌కులు. అయినా మ‌న హీరోల వ‌య‌సు చెప్పేవ‌ర‌కు కూడా తెలియ‌దు. ఎందుకంటే మెయింటెనెన్స్ అలా ఉంటుంది మ‌రి. 

మ‌హేశ్ అయితే 44లో కూడా ఇంకా 22లా ఉన్నాడు. ఈయ‌న వ‌య‌సు ఇంత అని కొత్త‌వాళ్ల‌కు చెబితే షాక్ త‌ప్ప‌దు. ఎన్టీఆర్ కూడా అంతే. ఈ ఇద్ద‌రు హీరోలు ఇప్పుడు స్టూడెంట్స్ గానే క‌నిపిస్తున్నారు. అర‌వింద స‌మేత‌లో ఫ్యాక్ష‌న్ ప‌గ‌ల‌ను త‌గ్గించ‌డానికి వ‌చ్చే ప్రేమికుడిగా క‌నిపిస్తున్నాడు ఈ హీరో. ఇక వంశీ పైడిప‌ల్లి సినిమాలో మ‌హేశ్ అయితే ఫారెన్ నుంచి వ‌చ్చి ఇక్క‌డ రైతుల కోసం పాటుప‌డే ఓ కార్పోరేట్ కంపెనీ సిఈఓగా న‌టిస్తున్నాడు. గ‌తంలో ర‌భ‌స.. రామ‌య్యా వ‌స్తావ‌య్య లాంటి సినిమాల్లో స్టూడెంట్ గా క‌నిపించాడు ఎన్టీఆర్. ఇక మ‌హేశ్ శ్రీ‌మంతుడులో కాసేపు విద్యార్థిగా క‌నిపించాడు. మ‌ళ్లీ ఇప్పుడు త‌మ సినిమాల కోసం పుస్త‌కాలు ప‌డుతున్నారు ఈ సూప‌ర్ స్టార్స్. మ‌రి వీళ్ల చ‌దువులు ఎలా ఉండ‌బోతున్నాయో..? 

More Related Stories