English   

భరత్ బహిరంగ సభనుంచి రంగస్థలం వెళ్లారా...?

Mahesh-Babu
2018-04-09 10:20:22

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనేనేను బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ స్పీచ్ కు ఎంటైర్ వేదిక ఫిదా అయిపోయింది. తర్వాత మహేష్ బాబు కూడా ‘తారక్ నేర్పిన’ మాటలతో మళ్లీ ఆకట్టుకున్నాడు.. అంత వరకూ బానే ఉన్నా.. కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు రామ్ చరణ్, సుకుమార్, దానయ్య, కొరటాల ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అరె.. చరణ్, సుకుమార్ ఈ ఫంక్షన్ కు రాలేదు కదా.. వీళ్లెక్కడ కలిశారు అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై చాలామంది ఆరాలు కూడా తీశారు. అయితే బహిరంగ సభ అయిపోగానే మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి రంగస్థలం టీమ్ ను కలవడానికి వెళ్లింది. అదీ మేటర్ అక్కడే ఈ ఐదుగురు కలిసి కొన్ని ఫోటోలు దిగారు. అవే ఆ తర్వాత నెట్ లో, సోషల్ మీడియలో హల్చల్ చేశాయి. 

మొత్తంగా మహేష్ బాబు చెప్పినట్టు.. ఇండస్ట్రీలో ఐదారుగురు కంటే పెద్ద స్టార్స్ లేరు. అందరూ కలిసి యేడాదికో సినిమా చేస్తూ.. హిట్స్ కొడుతూ.. ఒకరి సినిమా ఫంక్షన్ కు అటెండ్ అయితే ఇండస్ట్రీలోని వాతావరణమే మారిపోతుంది. నిజంగానే అతను చెప్పినట్టు వాళ్లూవాళ్లూ బానే ఉణ్నారు. ఇక మారాల్సింది వారి అభిమానులే. అభిమానులు ఇంకా మారాల్సి ఉందని మహేషే చెప్పాడు. సో.. చూశారు కదా.. వీళ్లంతా ఒకరి సక్సెస్ ను ఒకరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో.. ఇకనైనా ఫ్యాన్స్ పేరుతో బూతులు తిట్టుకోవడం, గుడ్డలు చించుకోవడం ఆపేస్తే బెటర్. 

More Related Stories