English   

నిజాలు మాట్లాడిన మ‌హేశ్.. 

bharat-ane-nenu
2018-04-08 13:56:26

ఎప్పుడూ ఆడియో వేడుక అంటే మా సినిమా ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. ఇంత గొప్ప‌గా ఉంటుంది అని హీరోలు గొప్ప‌లు చెబుతుంటారు. మా ఫ్యామిలీ ఇలా అలా అని చరిత్ర‌లు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు మ‌హేశ్ మాత్రం చాలా కొత్త‌గా మాట్లాడాడు. భ‌ర‌త్ అనేనేను బ‌హిరంగ‌స‌భ‌లో మ‌హేశ్  మాట్లాడిన అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోల గురించి.. వాళ్ల మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి అభిమాన‌ల‌కు తెలియ‌ని విష‌యాన్ని తెలిసేలా.. బుర్ర‌ల‌కు ఎక్కేలా చెప్పాడు సూప‌ర్ స్టార్. ఓ హీరో న‌టించిన సినిమాను మ‌రో హీరో పొగ‌డ‌టం.. మ‌ల్టీస్టార‌ర్స్ లో న‌టించ‌డం.. ఇలా అన్నీమారిపోతున్నాయి ఇండ‌స్ట్రీలో ఇప్పుడు. ఇదే విష‌యాన్నిచెప్పాడు మ‌హేశ్. ఇక నుంచి ప్ర‌తీ హీరో ఫంక్ష‌న్ కు ఇంకో హీరో వ‌స్తాడ‌ని.. ట్రెండ్ మారుతుందిన మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పాడు మ‌హేశ్.  ఓ పెద్ద హీరో సినిమాకు మ‌రో హీరో రావ‌డం వ‌ల్ల అభిమానుల్లోనూ త‌మ స్నేహం గురించి తెలుస్తుంద‌ని చెబుతున్నాడు మ‌హేశ్. మేం మేం బాగానే ఉంటాం.. ఎప్ప‌ట్నుంచో ఇలాగే ఉన్నాం.. కానీ అభిమానులు మీరే ఎందుకో గొడ‌వ ప‌డుతుంటారు. అది ఇప్పుడు మారి పోవాలి.. బాగుంటుంది.. అంతా బాగుందాం అంటూ చెప్పుకొచ్చాడు మ‌హేశ్ బాబు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు ఐదారుగురే.. మేం అంతా తిప్పికొడితే ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నాం.. అంద‌రి సినిమాలు ఆడాలి అప్పుడే ఇండ‌స్ట్రీకి బాగుంటుంది అంటూ పెద్ద‌రికంగా మాట్లాడాడు మ‌హేశ్. ఈయ‌న మాట‌లు అభిమానుల‌కు నేరుగానే త‌గిలేసాయి. అంతేక‌దా మ‌రి.. ఉన్న‌దే అర‌డ‌జ‌న్ మంది హీరోలు.. మ‌ళ్లీ దానికి ఫ్యాన్స్.. యాంటీ ఫ్యాన్స్.. ఎందుకీ గొడ‌వ‌ల‌న్నీ..? అచ్చంగా మ‌హేశ్ చెప్పింది ఫాలో అయిపోతే పోలా..?

More Related Stories