English   

బాహుబలి-2  కంటే స్పైడర్ టాప్..?

spyder-baahubali

బాహుబలి-2.. ప్రపంచానికి ఇండియన్ సినిమా కెపాసిటీని తెలియజేసిన సినిమా. ఎంటైర్ కంట్రీ సాహో రాజమౌళి అన్న సినిమా. చిన్న పాత్రలో కనిపించిన ఆర్టిస్ట్ కూడా బాహుబలిలో నటించాను అని కాలరెగరేసుకున్న సినిమా. మరి అలాంటి సినిమాను అట్టర్ ఫ్లాప్ అయి, మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన స్పైడర్ దాటేయడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఆలోచిస్తే అది అసాధ్యమే. కానీ దాన్ని సుసాధ్యం చేశాడు మహేష్ బాబు. బాహుబలి-2 కంటే స్పైడరే బెస్ట్ అనేలా చేశాడు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. అయితే మహేష్ బాబు బాహుబలి కంటే బెస్ట్ అనిపించుకుంది తెలుగులో కాదు.. తమిళ్ లో. యస్ తమిళనాట బాహుబలి-2  కంటే స్పైడర్ కే పట్టం కట్టారు ప్రేక్షకులు. ఇంకా చెప్పాలంటే బాహుబలి-2 మాత్రమే కాదు.. అక్కడి పవర్ స్టార్ విజయ్ కంటే కూడా స్పైడర్ టాప్ లో ఉన్నాడు.

నిజానికి బాహుబలి -2తో పోటీ పడే సత్తా ఉన్న హీరో ఇప్పుడెవరూ లేరు కానీ స్పైడర్ కు ఎలా సాధ్యం అయింది. అదీ.. బుల్లితెరపై పాజిబుల్ అయింది. అవును రీసెంట్ గా తమిళనాడులో టివిలో ఈ మూడు సినిమాలూ ప్రదర్శించారు. బాహుబలి-2 ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. కానీ మేర్సల్ ఫస్ట్ టైమే. ఇటు స్పైడర్ కూడా. ఈ మూడిటి మధ్య జరిగిన రేటింగ్ పోటీలో ఫైనల్ గా స్పైడర్ గెలవడం విశేషం. యస్.. బుల్లితెర రేటింగ్స్ లో మహేష్ బాబు స్పైడర్ కు 10.4 రేటింగ్ వచ్చింది. తర్వాత బాహుబలి-2 కు 10.3 రేటింగ్ వచ్చింది. ఇక తమిళ్ సూపర్ స్టార్ విజయ్ మేర్సల్ కు 10 రేటింగ్ రావడం విశేషం. మొత్తంగా వెండితెరపై డిజాస్టర్ గా నిలిచిన స్పైడర్ బుల్లితెరపై ఇలా రెండు బిగ్గెస్ట్ హిట్ మూవీస్ పై నెగ్గడం ఆశ్చర్యమే. అయితే మహేష్ బాబు ఫస్ట్ టైమ్ తమిళ్ లో చేసిన సినిమా కావడం.. అక్కడ ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్న మురుగదాస్ దర్శకుడు కావడం కూడా స్పైడర్ కు కలిసొచ్చిందని చెప్పొచ్చు.. ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తో అయినా కాస్త ఊరట చెందుతారేమో.. 

More Related Stories