English   

 మ‌హేశ్.. ముద్దే పెట్టు ముద్దే పెట్టు..!

Mahesh-Thanks-Namrata
2018-04-23 08:24:57

అప్పుడెప్పుడో ముద్దేపెట్టు ముద్దేపెట్టు అంటూ అనుష్క‌తో నాగార్జున పాడుకున్నాడు. ఇప్పుడు మ‌హేశ్ ఆ పాట పాడుకుంటున్నాడు. ఈయ‌న ఏ సినిమాలో ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు రీల్ లైఫ్ కోసం కాదు రియ‌ల్ లైఫ్ కోసం ఈ పాట పాడాడు మ‌హేశ్. త‌న బెట‌ర్ హాఫ్ న‌మ్ర‌త‌తో ముద్దుల్లో మునిగిపోయాడు సూప‌ర్ స్టార్. ఎప్పుడూ ప్రైవేట్ లైఫ్ ను దాచుకోడు సూప‌ర్ స్టార్. కుటుంబానికి సంబంధించిన ఫోటోల్ని ఎక‌ప్పుడూ అభిమానుల‌తో పంచుకుంటుంటాడు మ‌హేశ్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. అయితే ఈ సారి ఇంకాస్త ప్రైవేట్ ఫోటో ఇది. త‌న భార్య న‌మ్ర‌త‌ను ముద్దు పెట్టుకుంటున్న‌పుడు తీసుకున్న ఫోటో ఇది. ఇప్పుడు ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. భ‌ర‌త్ అనే నేను స‌క్సెస్ తో గాల్లో తేలిపోతున్న మ‌హేశ్.. ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. 

More Related Stories