English   

మ‌హేశ్ తో కొర‌టాల‌.. మ‌రోసారి..!

Mahesh-Koratala
2018-08-07 10:47:44

మ‌హేశ్ బాబు-కొర‌టాల శివ‌.. ఈ కాంబినేష‌న్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేశ్ ను ఈ మ‌ధ్య కాలంలో ఈయ‌న చాలా బాగా అర్థం చేసుకున్నాడు. రెండోసారి మ‌హేశ్ కు సూప‌ర్ హిట్ ఇవ్వ‌లేరు అనే సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసాడు కొర‌టాల‌. శ్రీ‌మంతుడు రేంజ్ లో భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయినా.. క‌మ‌ర్షియ‌ల్ దానికంటే ఎక్కువ వ‌సూళ్లు సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్ద‌రూ మూడోసారి కూడా క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రూ సెట్స్ పైనే ఉన్నారు కూడా. అదెలా సాధ్యం.. మ‌హేశ్ ఇప్పుడు వంశీ సినిమాతో బిజీగా ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా..? 

ఈయ‌న వంశీ పైడిప‌ల్లి సినిమాతో పాటే యాడ్స్ కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అభిబ‌స్ యాడ్ షూట్ లో ఉన్నాడు సూప‌ర్ స్టార్. దీన్ని కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదివ‌ర‌కు మెహ‌ర్ ర‌మేష్, త్రివిక్ర‌మ్ ఎక్కువ‌గా మ‌హేశ్ తో యాడ్ షూట్ చేసేవాళ్లు. ఇప్పుడు కొర‌టాల ఆ ఆఫ‌ర్ అందుకున్నాడు. వెన్నెల కిషోర్ ఇందులో మ‌హేశ్ తో పాటు న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ యాడ్ విడుద‌ల కానుంది. ప‌నిలో ప‌నిగా ఓ వైపు సినిమా.. మ‌రోవైపు యాడ్స్ చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు సూప‌ర్ స్టార్. ఇక యాడ్ అయిపోయింది.. రేప‌టి రోజు సినిమా కూడా వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. అన్న‌ట్లు మ‌హేశ్ తో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క గుణ‌శేఖ‌ర్ త‌ప్ప మ‌రో ద‌ర్శ‌కుడెవ‌రూ మూడు సినిమాలు చేయ‌లేదు. ఒక్క‌డు.. అర్జున్.. సైనికుడు సినిమాలు చేసాడు గుణ‌శేఖ‌ర్. మ‌రి కొర‌టాల ఈ రికార్డ్ అందుకుంటాడేమో చూడాలి.

More Related Stories