English   

మురుగ‌దాస్ ను వ‌దిలించుకుంటున్న మ‌హేశ్.. 

2017-04-01 08:30:57

మురుగ‌దాస్ సినిమాను ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వియ‌త్నాంలో జ‌రుగుతుంది. అక్క‌డే భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్. ఈ సినిమాపై ముందు నుంచి చాలా ఆస‌క్తిగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. కానీ షూటింగ్ జ‌రుగుతున్న కొద్దీ మురుగ‌దాస్ సినిమాపై మ‌హేశ్ కు ఆస‌క్తి త‌గ్గి.. చిరాకు పెరిగింద‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం మురుగ‌దాస్ ప‌ర్ ఫెక్ష‌న్. తీసిందే తీసి.. మ‌ళ్లీమ‌ళ్లీ తీసి అన‌వ‌స‌రంగా టైమ్ వేస్ట్ చేస్తున్నాడ‌ని మురుగ‌దాస్ పై మ‌హేశ్ కాస్త కోపంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. 

పైగా ఫ‌స్ట్ లుక్ విష‌యంలోనూ సూప‌ర్ స్టార్ కాస్త అస‌హ‌నంగా ఉన్నాడని స‌మాచారం. ఫ్యాన్స్ ను హ‌ర్ట్ చేస్తూ ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై మ‌హేశ్ సీరియ‌స్ గా ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా మురుగ‌దాస్ టార్చ‌ర్ మ‌హేశ్ త‌ట్టుకోలేక‌పోతున్నాడ‌ని ఈ సినిమాకు ప‌ని చేస్తున్న వాళ్లే చెప్పుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్ విష‌యంలోనూ చాలా ల్యాగ్ చేస్తున్నాడు మురుగ‌దాస్. దీనికి స్పైడ‌ర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ అయిపోయిన‌ట్లే. ఇప్ప‌టికే ఈ పేరుతో లోగో కూడా సిద్ధం చేసారు నిర్మాత ఠాగూర్ మ‌ధు. ఇక మ‌హేశ్ కూడా వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి కొర‌టాల శివ‌తో జ‌త క‌ల‌వాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ఆ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. సినిమా సినిమాకు మ‌ధ్య కొన్ని రోజులు గ్యాప్ తీసుకునే మ‌హేశ్.. ఈ సారి ఆ హాలీడేస్ కూడా త్యాగం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి మురుగ‌దాస్ బారి నుంచి మ‌హేశ్ బాబు ఎప్పుడు బ‌య‌ట‌పడ‌తాడో చూడాలిక‌. 

More Related Stories