English   

మ‌హేశ్ అనుకున్న‌ట్లు పూర్తిచేస్తాడా..? 

Mahesh-Vamsi-Paidipally

కావాల్సినంత స్టార్ డమ్ ఉంది.. రికార్డులు తిర‌గ‌రాసే ద‌మ్ము కూడా ఉంది. కానీ లేనిద‌ల్లా ప్లానింగ్ ఒక్క‌టే. అది కూడా స‌రిగ్గా ఉండి అనుకున్న‌ది అనుకున్న‌ట్లు కానీ పూర్తి చేస్తే మ‌హేశ్ కు తిరుగుండ‌దు. కానీ ఏం చేస్తాం.. ఏం చేసినా కాస్త లేట్ గా సినిమాలు చేస్తుంటాడు ఈ హీరో. అనుకున్న టైమ్ కు అస్స‌లు మొద‌లుపెట్ట‌డు. ఇప్పుడు వంశీ పైడిప‌ల్లితో కూడా అంతే. ఈ చిత్రం నిజానికి జూన్ 10 నుంచి మొద‌లు పెట్టాల్సింది. కానీ జూన్ 18 న మొద‌లుపెట్టారు.  డెహ్రాడూన్ ప‌రిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. ఈ షూటింగ్ స్పాట్ కు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ కూడా వ‌చ్చారు. మ‌హేశ్ తో కాసేపు ముచ్చ‌టించారు. ఈ షెడ్యూల్లో మ‌హేశ్ తో పాటు అల్ల‌రి న‌రేష్ కూడా పాల్గొంటాడ‌ని తెలుస్తుంది. అశ్వినీద‌త్, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మ‌హేశ్ కు మాత్ర‌మే కాదు.. అల్ల‌రి న‌రేష్ కు కూడా కీల‌క‌మే. భ‌ర‌త్ అనే నేనుతో అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయాడు మ‌హేశ్. ఈ చిత్రం 92 కోట్ల షేర్ సాధించినా కూడా అమ్మింది మాత్రం 99 కోట్ల‌కు. అంటే 7 కోట్లు లాస్ అన్న‌మాట‌. దాంతో ఇప్పుడు వంశీ సినిమాతో అది కూడా క‌వ‌ర్ చేయాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్. డిసెంబ‌ర్ లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి.. అదే నెల‌లో సుకుమార్ సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి ప్ర‌య‌త్నాలైతే బాగానే చేస్తున్నాడు మ‌హేశ్. వంశీ సినిమాలో పూజాహెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి షూటింగే అనుకున్న స‌మ‌యానికి స్టార్ట్ కాలేదు.. షూటింగ్ అయినా అనుకున్న టైమ్ కు పూర్త‌వుతుందో లేదో..? 

More Related Stories