English   

వంశీ అమెరికాను జ‌ల్ల‌డ ప‌డుతున్నాడుగా.. 

Vamshi-Paidipally

వంశీ పైడిప‌ల్లికి సెల‌వులు పూర్తైపోతున్నాయి. ఎవ‌రికైనా నెల.. రెండు నెల‌లు హాలీడేస్ ఉంటాయి. కానీ ఈ ద‌ర్శ‌కుడు మాత్రం ఎప్పుడూ తీసుకున్నా మినిమ‌మ్ రెండేళ్లు తీసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈయ‌న గ‌త సినిమా ఊపిరి విడుద‌లై రెండేళ్లు దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా మొద‌లుపెట్ట‌లేదు వంశీ. ఇప్పుడు మ‌హేశ్ బాబు సినిమాతో బిజీ కానున్నాడు. మ‌రోవైపు మ‌హేశ్ కూడా భ‌ర‌త్ అనే నేను ప్ర‌మోష‌న్ ను పూర్తి చేసుకుని వంశీ వైపు రానున్నాడు. ఈ చిత్రం విడుద‌లైన త‌ర్వాత కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రామిస్ అని.. స‌క్సెస్ మీట్ అని.. కేటీఆర్ కార్య‌క్ర‌మం అని రోజుకో ర‌కంగా బిజీగానే ఉంటున్నాడు సూప‌ర్ స్టార్. మ‌రో వారం రోజుల్లో ఈ క‌థ‌ అంతా పూర్తి కానుంది. ఇది పూర్తైన వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వంశీ సినిమా మొద‌లు పెట్ట‌బోతున్నాడు మ‌హేశ్ బాబు. ఇప్ప‌టికే ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్తైపోయింది. ఇక మ‌హేశ్ వ‌చ్చి షూటింగ్ లో జాయిన్ అవ్వ‌డ‌మే ఆల‌స్యం. జూన్ నుంచి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్ప‌టికే అమెరికా వెళ్లి వంశీ పైడిప‌ల్లి లొకేష‌న్ల వేటలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్ లో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఇందులో అల్ల‌రి న‌రేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. దిల్ రాజు, అశ్వినీద‌త్ నిర్మాత‌లు. మొత్తానికి రెండేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ వంశీ పైడిప‌ల్లిని బిజీగా మార్చ‌బోతున్నాడు మ‌హేశ్ బాబు. అన్న‌ట్లు ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా న‌టించ‌బోతుంది.
 

More Related Stories