English   

పిచ్చెక్కించిన పాకిస్థాన్ పోరి..

mahira-khan
2018-05-17 17:11:06

మ‌హీరా ఖాన్.. ఈ పేరు ఇక్క‌డ కాదు కానీ ప‌క్క‌నున్న పాకిస్థాన్ లో మాత్రం సంచ‌ల‌న‌మే. అక్క‌డ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఈ భామ‌. వ‌య‌సు 30 దాటినా కూడా ఇప్ప‌టికీ మ‌హీరా అంటే ప‌డి చ‌చ్చిపోతారు పాకిస్థానీలు. అక్క‌డ ఏ సినిమాలో చూసినా ఈ భామే క‌నిపించేంత పాపుల‌ర్. హిందీలోనూ షారుక్ ఖాన్ స‌ర‌స‌న రాయిస్ లో న‌టించింది మ‌హీరా ఖాన్. ఈ అందం ఇప్పుడు కాన్స్ లో పిచ్చెక్కిస్తుంది. నిండుగా క‌ప్పుకుని కూడా చూపుల‌తోనే మతులు పోగొడుతుంది మ‌హీరా ఖాన్. ఈమె గ్లామ‌ర్ షో అక్క‌డున్న కెమెరాలు కూడా కుళ్లుకుంటున్నాయి. ప్ర‌స్తుతం పాకిస్థానీ సినిమాల‌తోనే బిజీగా ఉన్న మ‌హీరా.. అవ‌స‌రం అయితే క‌చ్చితంగా ఇండియాలో కూడా న‌టిస్తానంటుంది. అయితే షారుక్ అంత గొప్ప మ‌న‌సు ఇత‌ర హీరోల‌కు క‌నిపించ‌డం లేదు. అందుకే మహీరాకు మ‌న ద‌గ్గ‌ర ఆఫ‌ర్లు రావ‌డం లేదు. అయినా స‌రే సింపుల్ గా త‌న దేశంలో.. త‌న సినిమాల్లోనే న‌టిస్తూ బిజీగా ఉంది ఈ భామ‌.

More Related Stories