40ల్లో ఆమె అందం కెవ్వుకేక..

ఐటం సాంగ్స్ లో కెవ్వు కేకను మరిచిపోలేం. ఎందుకంటే అందులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. దానికితోడు మలైకా ఆరోరా అందాలున్నాయి. ఈ పాటతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది సల్మాన్ మరదలు. బాలీవుడ్ లో ఈ భామకు ఐటం భామగా క్రేజ్ ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లకునే ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది మలైకా. ఈ మధ్య భర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ.. ఓ కుర్ర హీరోతో కలిసి ఎఫైర్ నడుపుతుందనే వార్తలు కూడా బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా కూడా ఇప్పటికీ తన ఫిజిక్ విషయంలో మాత్రం అల్లాడిస్తూనే ఉంది మలైకా. ఇప్పుడు కూడా అదిరిపోయే షోతో పిచ్చెక్కించింది. యోగాతో బాడీని స్ప్రింగ్ కంటే దారుణంగా తిప్పేసి మనసులను కూడా అలా మెలి పెట్టేసింది మలైకా. 44 ఏళ్ల వయసులో మలైకా మరో హాట్ ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఈమెకు నిజంగా నాలుగు పదుల వయసు ఉందంటే నమ్మడం మాత్రం సాధ్యం కాదు. ఏజ్ పెరుగుతున్నా కూడా తనలో ఇంకా వన్నె తరగలేదని నిరూపిస్తూ కెవ్వుకేక పెట్టిస్తుంది మలైకా అరోరాఖాన్.