English   

కరోనాకు అదిరిపోయే వంటింటి చిట్కా చెప్పిన కెవ్వు కేక బ్యూటీ..

Malaika Arora
2020-07-07 09:14:33

కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్‌లో విళయతాండవం చేస్తుంది. ఇక్కడ రోజుకు కనీసం పాతిక వేల కేసులు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పటికే 8 లక్షలకు చేరువలో వస్తున్నాయి కరోనా కేసులు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కరోనా కంట్రోల్ అయ్యేలా కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానానికి చేరుకుంది భారత్. దాంతో మన వాళ్లు అంతా భయపడుతున్నారు. అసలు కరోనా వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియకప్రభుత్వాలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొందరు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోనే ఉండి కొందరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంటింటి చిట్కాలు కూడా కరోనాను నివారిస్తాయని చెప్తున్నారు కొందరు సెలబ్రిటీస్. 

ఇప్పుడు బాలీవుడ్ నటి మలైకా అరోరా కూడా వంటింటి చిట్కాతో వచ్చేసింది. ఇళ్లలో ఉండే పసుపు, ఆపిల్, అల్లం, వెనిగర్, పెప్పర్‌ని ఉపయోగించి తయారు చేసుకున్న కషాయంతో కరోనాని కట్టడి చేయవచ్చని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. కచ్చితంగా ఇది అద్భుతమైన ఫలితం ఇస్తుందని చెప్తుంది కెవ్వు కేక బ్యూటీ. అంతేకాదు ఈ కషాయం తీసుకుంటే కరోనా మీ దరిదాపుల్లోకి కూడా రాదని ఆమె నమ్మకంగా చెప్తుంది. ఈ చిట్కాకు సంబంధించిన వీడియోని తాజాగా మలైకా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మలైకా అరోరా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం అభిమానులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని వాళ్లు కూడా సోషల్ మీడియాలో రిప్లై ఇస్తున్నారు.
 

More Related Stories