English   

పెళ్లి సందడి హీరోయిన్ ఫిక్స్

Malavika Nair
2020-10-29 11:49:19

శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అప్పట్లో తీసిన "పెళ్లి సందడి" సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.  తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీసినప్పటికీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం ప్లస్ కాగా మ్యూజికల్ హిట్ అంటూ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ఓ చిన్న టైటిల్ వీడియో ను కూడా విడుదల చేసారు. ఈ సినిమాను ఆర్కా మీడియా మరియు ఆర్ కె ఫిల్మ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను శ్రీకాంత్ తనయుడు రోషన్ తో చేయాలని నిశ్చయించుకున్నారు. రోషన్ ఇప్పటికే ఒక సినిమాలో నటించగా అతడికి పెళ్లి సందడి రెండో సినిమా కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలైంది. దాంతో కొంతమంది భామల పేర్లు భయటకు వాడుతున్నాయి. 

తాజాగా ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మాళవిక నాయర్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలుబడలేదు. మాళవిక నాయర్ ఒరేయ్ బుజ్జిగా, కల్యాణ వైభోగమే సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా మూడేళ్ళ తరవాత మళ్ళీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రాఘవరేంద్రరావు 2017 లో నాగార్జున తో ఓం నమోవెంకటేశాయ సినిమా  తీశారు. ఆ తరవాత ఆయన చాలా గ్యాప్ తరవాత ఈ సినిమా చేస్తున్నారు. ఇక జూనియర్ శ్రీకాంత్ పెళ్లి సందడి ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories