English   

నేలటికెట్ పిల్ల భలే ఛాన్స్ పట్టిందే..

Malavika-Sharma

రవితేజ నేల టిక్కెట్టు సినిమాలో హీరోయిన్ మాళవిక శర్మ. పాపకిది ఫస్ట్ మూవీయే. ఏజ్ జస్ట్ నైన్టీన్ అంటోంది. మరి ఇంత చిన్నపిల్ల మాస్ రాజాతో రొమాన్స్ కు ఎలా ఒప్పుకుందో అనుకున్నారంతా.. అందుకు కారణాలేంటో మెల్లగా తెలుస్తున్నాయిప్పుడు. అందం, అది పారేసుకునే తెలివీ ఉన్న మాళవికకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని టాక్. అయినా ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే నెక్ట్స్ మూవీ ఆఫర్ వచ్చిందంటే అమ్మడు సోషల్ మీడియాలో చేస్తోన్న అందాల రచ్చే ఓ కారణమైతే.. అమ్మడి ఫేస్ లో కనిపించే అమాయకత్వం కొన్ని కథలకు పర్ఫెక్ట్ గా సూట్ అవడం మరో రీజన్ అనుకోవచ్చు. ఇంతకీ ఈ టీనేజ్ బ్యూటీకి వచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా.. గరుడవేగతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రవీణ్ సత్తారు కొత్త సినిమాలో మాళవికను తీసుకున్నాడు. మరి ఈ మూవీలో హీరో ఎవరో తెలుసు కదా.. రామ్. యస్.. రామ్ తోనే మాళవిక రొమాన్స్ చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది.

కథానుసారం ఓ ఫ్రెష్ ఫేస్ అయితే బావుటుందనుకున్నారట. పైగా రామ్ తో ఈ భామ జంట కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే ఆ భామను అప్రోచ్ అవుతున్నారని వినిపిస్తోంది. ప్రస్తుతం నేల టిక్కెట్టు తప్ప చేతిలో మరో సినిమా లేదు కాబట్టి మాళవిక కూడా నో చెప్పే చాన్స్ లేదు. పైగా దర్శకుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్నాడు. రామ్ గురించి ఇప్పటికే తెలుసుకుని ఉంటుంది. సో నేలటిక్కెట్టు భామతో రామ్ రొమాన్స్ చేయడం దాదాపు కన్ఫార్మ్ అంటున్నారు.  భవ్యక్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాడు. తన గత సినిమాల ప్రభావం ఏమాత్రం లేని స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నాడంటున్నారు. కాకపోతే గరుడవేగ లాగానే ఈ సినిమాకూ టైట్ స్క్రీన్ ప్లే హైలెట్ అంటున్నారు. ప్రస్తుతం రామ్ దిల్ రాజు బ్యానర్ లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. ఆ సినిమా సంగతెలా ఉన్నా.. ప్రవీణ్ సత్తారు సినిమా మాత్రం రామ్ కెరీర్ కు కొత్త బూస్టప్ ఇస్తుందనుకోవచ్చు. 

More Related Stories