English   

రవితేజను ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్..?

Malvika-Sharma
2018-04-18 17:58:05

మాస్ మహరాజ్ రవితేజ వెనక్కి వెళ్లిపోతున్నాడా..? చెప్పిన డేట్ కు రాలేకపోతున్నాడా..? అంటే అవుననే వినిపిస్తోంది. ఆయన లేటెస్ట్ మూవీ నేలటిక్కెట్టు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చాలాకాలమే అయింది. కానీ ఆ డేట్ కు రావడం సాధ్యం కావడం లేదనేది లేటెస్ట్ న్యూస్. యస్.. నేలటిక్కెట్టును వాళ్లు ముందే చెప్పినట్టుగా మే 25న విడుదల చేయలేకపోతున్నారు. అందుకు కారణం ఆ సినిమా హీరోయిన్ మాళవిక శర్మ. మాళవిక కొన్నాళ్ల క్రితం ఇదే షూటింగ్ లో గాయపడింది. కాలు బెణికింది. అప్పుడు షూటింగ్ వాయిదా పడింది. ఆ బెణుకుకు అప్పుడే చికిత్స తీసుకున్నారు. నిజానికి ఈ యాక్సిడెంట్ ను యూనిట్ దాయాలనుకుంది. కానీ కాలికి కట్టుతో మాళవిక ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో తన యాక్సిడెంట్ వల్లే షూటింగ్ వాయిదా పడిందని అందరికీ తెలిసిపోయింది. ఈ విషయంలో యూనిట్ ఈ టీనేజ్ బ్యూటీపై ఫైర్ అయింది కూడా. 

ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాకపోతే కొన్ని పాటలు బ్యాలన్స్ ఉన్నాయి.  కానీ ఆమె కాలు ఇంకా పెయిన్ ఉంది. దీనివల్ల ఆ కాలుపై పెద్దగా బరువు పడకుండా చూడాలనేది డాక్టర్ సలహా. డ్యాన్స్ అంటే రకరకాల మూమెంట్స్ ఉంటాయి. సో.. కష్టం. అంటే ఆ పాటలు కాకుండా షూటింగ్ కూడా కష్టం కదా. అందుకే మే 25 నుంచి నేలటిక్కెట్టు జూన్ 1వరకూ వెళ్లే అవకాశాలున్నాయనేది అక్కడి నుంచి వినిపిస్తోన్న వార్త. అయితే ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి.. పెయిన్ తగ్గితే వెంటనే పాటల షూటింగ్ మొదలుపెట్టాలనేది యూనిట్ ఆలోచన. ఏదేమైనా మేలో షూట్ స్టార్ట్ చేసినా.. మళ్లీ కొంత వర్క్ ఉంటుంది కాబట్టి.. అనుకున్న డేట్ కు వస్తారా అనేది కూడా డౌటే.. 

More Related Stories