English   

అమ్మో.. పాప మామూలు హాట్ కాదుగా..!

malvika-sharma

ఇంత‌కీ ఎవ‌రా పాప అనుకుంటున్నారా..? మ‌న ఇండ‌స్ట్రీలోకి ఎంతోమంది ముద్దుగుమ్మ‌లు వ‌స్తుంటారు పోతుంటారు. కానీ కొంద‌రు మాత్ర‌మే త‌మ కెరీర్ ఇక్క‌డే అని ఫిక్స్ అయిపోతుంటారు. ఒక్క సినిమా కూడా విడుద‌ల కాకుండానే మాళ‌విక శ‌ర్మ‌ను చూస్తుంటే ఇది నిజం అనిపిస్తుంది. ఈ భామ ప్ర‌స్తుతం ర‌వితేజ క‌ళ్యాణ్ కృష్ణ సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ఇన్నాళ్లూ యాడ్స్ తో ర‌ప్ఫాడించిన ఈ బ్యూటీ ఇప్పుడు వెండితెర‌ను వేడెక్కించ‌డానికి వ‌స్తుంది. మాళ‌విక శ‌ర్మ అంటే ఏదో ప‌ద్ద‌తిగా ఉంటుందేమో అనుకున్నారు కానీ బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఈ భామను చూసి బెంబేలెత్తాల్సిందే. అంత‌గా త‌న అందంతో సెగ‌లు రేపుతుంది ఈ ముద్దుగుమ్మ‌. 

ఈ మ‌ధ్యే ఈ భామ ఫోటో షూట్ ఒక‌టి విడుద‌లైంది. ఇందులో అందాల‌న్ని విచ్చ‌ల‌విడిగా ఆర‌బోసింది. ఇది చూసి వామ్మో.. పాప చాలా హాట్ క‌దా అనుకుంటున్నారు. ఇప్ప టికే చాలా యాడ్స్ లో న‌టించింది మాళ‌విక శ‌ర్మ‌. టీవీల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు సినిమాల్లోకి వ‌చ్చేస్తుంది. ర‌వితేజ లాంటి స్టార్  హీరో సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది మాళ‌విక‌. అమ్మ‌డు అందాల ఆర‌బోత చూస్తుంటే త్వ‌ర‌లోనే తెలుగులో ప‌క్కా సెటిలైపోయేలా క‌ళ‌లైతే క‌చ్చితంగా క‌నిపిస్తున్నాయి. తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే ఈ ముద్దుగుమ్మ గురించి మ‌న హీరోలు ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. మ‌రి చూడాలిక‌.. క‌ళ్యాణ్ కృష్ణ సినిమా విడుద‌లైన త‌ర్వాత తెలుస్తుంది మాళ‌విక స్టామినా ఏంటో..? 
 

More Related Stories