English   

ఎన్టీఆర్ బ్యూటీ ఇన్నాళ్ల త‌ర్వాత‌..

Mamta Mohandas

మ‌మ‌తా మోహ‌న్ దాస్.. ఈ పేరు ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..! అప్పుడెప్పుడో ప‌దేళ్ల కింద ఎన్టీఆర్ య‌మ‌దొంగ‌లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ పెద్ద‌గా క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగులో కృష్ణార్జున.. విక్టరీ.. కథానాయకుడు.. హోమం.. కింగ్.. 'చింతకాయల రవి.. లాంటి సినిమాల్లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఈమెకు ఏదీ పెద్ద‌గా బ్రేక్ తీసుకురాలేదు. ఆ త‌ర్వాత సొంత ఇండ‌స్ట్రీ మ‌ళ‌యాలంలో బిజీ అయిపోయింది మ‌మ‌తా మోహ‌న్ దాస్. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన మ‌మ‌త‌.. విడాకుల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు చేసింది. కానీ కొన్నేళ్లుగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన మ‌మ‌త‌.. ఇప్పుడు మ‌ళ్లీ ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తుంది. చాలా ఏళ్ళ త‌ర్వాత ఈమె ఓ త‌మిళ సినిమాకు క‌మిటైంది. అది కూడా ప్ర‌భుదేవా హీరోగా. ఊమై విళిగల్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. స‌రిగ్గా 32 ఏళ్ల కింద‌.. అంటే 1986లో ఇదే టైటిల్ తో ఓ సినిమా వ‌చ్చింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో మ‌రో సినిమా వ‌స్తుంది. అయితే దీనికి దానికి ఏ సంబంధం లేద‌ని చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది కేవ‌లం టైటిల్ మాత్ర‌మే తీసుకున్నామ‌ని చెప్పారు వాళ్లు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఊటిలో జ‌రుగుతుంది. మొత్తానికి చూడాలిక‌.. మ‌మ‌త సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories