English   

మంచి న‌టుడిని మిస్ అయ్యామా?

Manchi-Natudini-Miss-Ayyama
2017-05-04 07:55:04

రాజ‌మౌళి అంటే ఏమిటో మ‌న‌కు ఎప్పుడో తెల‌సింది కానీ... ప్ర‌పంచ సినిమా జనాల‌కు మాత్రం `బాహుబలి` సినిమాలు వ‌చ్చాకే తెలిసింది. అదీ అలా ఇలా కాదు... ఓ సునామీలాగా దూసుకొచ్చాడు. అయితే రాజ‌మౌళి గురించి ఇప్పుడు మ‌రో విష‌యం తెలిసింది. చాలా కాలం క్రితం రాజ‌మౌళి హీరో అవుదామ‌నుకున్నాడ‌ట‌. అవును మీరు చ‌దువుతున్న‌ది నిజ‌మే. అదేంటి ద‌ర్శ‌కునిగా మంచి రేంజులో ఉన్న రాజ‌మౌళికి హీరో అవ్వాల‌ని ఎందుకనిపించింది అనుకుంటున్నారా? ఆయ‌న హీరో అవుదాం అనుకున్న‌ది ఇప్ప‌డు కాదు ఇంకా ద‌ర్శ‌కుడు కాని రోజుల్లో. అవును కుర్రాడిగా ఉన్నప్పుడు హీరో అవుదాం అనుకున్నాడ‌ట‌. అయితే త‌న రూటు అది కాద‌ని తెలిసి ద‌ర్శ‌క‌త్వంవైపు అడుగులేశాడు. అయితే న‌టుడిగా త‌న‌కున్న ఆస‌క్తి వ‌ల్లే అప్ప‌డప్పుడు చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు.

ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేసిన రాజ‌మౌళి మ‌రి న‌టుడిగా ఎంత పేరు  తెచ్చుకునేవాడో. రాజ‌మౌళి కుటుంబంలో సినిమాల‌క‌కు సంబంధించిన అన్ని విభాగాల వారూ ఉన్నారు. రాజమౌళి హీరో అయ్యుంటే అంద‌రూ ఉండేవారు. అయితే మంచి ద‌ర్శ‌కుడిని మాత్రం కోల్పోయేవాళ్లం. కాబ‌ట్టి మంచి న‌టుడిని మిస్ అయ్యామ‌ని బాధ ప‌డ్డ‌క్క‌ర్లేదు.

More Related Stories