English   

మంచు లక్ష్మి ఇన్వెస్టిగేషన్ ఫలిస్తుందా..?

manchu lakshmi wife of ram
2018-06-08 14:25:26

మంచు ఫ్యామిలీ నుంచి రిజల్ట్ తో సంబంధం లేకుండా రెగ్యులర్ గా సినిమాలు తీస్తూ వస్తోన్న నటి లక్ష్మి. ఇన్నాళ్లూ తనేం చేసినా లైట్ గానే అనుకున్నారు కొందరు. కానీ ఈ సారి ఆ కొందరిని కూడా మెప్పించేందుకు కాస్త వెయిట్ తోనే వస్తున్నట్టు తన లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా..? ‘వైఫ్ఆఫ్ రామ్’. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీకి విజయ్ ఎలకంటి అనే కొత్త దర్శకుడు నిర్దేశకుడు. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. లక్ష్మి పాత్ర, తన నటన కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 

తన భర్తను హత్య చేసిన వ్యక్తులను కనుక్కొనే ఇల్లాలుగా లక్ష్మి ఈ సినిమాలో కనిపిస్తుంది. కానీ  మానసికంగా ఆమె ప్రవర్తించే విధానం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు. అలాగే భర్త హత్యపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా.. మళ్లీ తనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మరి తన ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది. పోలీస్ ల విచారణలో ఏం తేలింది అనేదే సినిమా కావొచ్చని ఈ ట్రైలర్ చూస్తోంటే తెలుస్తోంది. మొత్తంగా ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న మంచు లక్ష్మి ఈ సారి ఓ అద్భుతమైన కాన్సెప్ట్ తో వస్తోందనేది మాత్రం అర్థమౌతోంది. మరి ఈ ట్రైలరేనా.. లేక సినిమా కూడా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. 

More Related Stories