English   

మ‌నోజ్ రిటైర్మెంట్.. టూర్ ఎంజాయ్ మెంట్..!

manoj-manchu
2018-07-25 13:39:13

మంచు మ‌నోజ్ కుమార్.. మోహ‌న్ బాబు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా కొట్ట‌లేక‌పోయాడు మ‌నోజ్. చాలా సినిమాలు చేసాడు.. కానీ అన్నీ ఇలా వ‌చ్చి వెళ్లిపోయిన సినిమాలే. గ‌తేడాది వ‌చ్చిన ఒక్క‌డు మిగిలాడు కూడా డిజాస్ట‌రే. ఈ చిత్రంలో కంటెంట్ కు మంచి పేరు వ‌చ్చినా సినిమాగా నిల‌బ‌డ‌లేదు ఇది. ఈ సినిమా త‌ర్వాత తాను సినిమాల‌కు దూరం అవుతున్న‌ట్లు.. ఒక్క‌డు మిగిలాడు త‌ర్వాత రిటైర్ మెంట్ ఇస్తున్న‌ట్లు అప్ప‌ట్లో మ‌నోజ్ చేసిన ట్వీట్ అంద‌రికీ షాక్ ఇచ్చింది. అప్పుడు అలా చేస్తే అంతా జోక్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఇది నిజ‌మే అనిపిస్తుంది. 
ఎందుకంటే ఆ సినిమా వ‌చ్చి ఇన్నాళ్లైనా క‌నీసం త‌ర్వాతి సినిమా గురించి ఆలోచించ‌డం లేదు మ‌నోజ్. పైగా దేశాలు తిరిగేస్తున్నాడు. సినిమాలు లేక బ్యాగ్ వేసుక‌ని ప్ర‌కృతిని ప్రేమించ‌డానికి బ‌య‌ల్దేరాడు. ఇప్పుడు కూడా ఎక్క‌డో ఓ చోట ఆగి త‌న టూర్ ఫోటోస్ ను ట్వీట్ చేసాడు మ‌నోజ్. అప్ప‌ట్లో రిటైర్మెంట్ ఇస్తున్నాన‌ని ఇండ‌స్ట్రీ మొత్తానికి షాకిచ్చిన మ‌నోజ్.. ఇప్పుడు త‌న టూర్ తో క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఇప్పుడు మ‌నోజ్ తీరు చూస్తుంటే సినిమాల వైపు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. త‌న తండ్రి బిజినెస్ లు చూసుకుంటూ కెరీర్ ముందుకెళ్లాల‌ని చూస్తున్నాడు ఈ హీరో. మ‌రోవైపు విష్ణు కూడా సినిమాలు మానేసి స్కూల్ బిజినెస్ వైపు అడుగేస్తున్నాడు. 

More Related Stories