English   

మ‌నోజ్ కు ఎక్క‌డో కాలిందిగా.. 

Manchu-Manoj
2018-09-26 14:33:29

మంచు మ‌నోజ్ ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. ఒక్క‌డు మిగిలాడు త‌ర్వాత ఈయ‌న స్క్రీన్ పై క‌నిపించ‌డ‌మే మానేసాడు. రిటైర్మెంట్ కూడా ఇచ్చిన‌ట్లే క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న హాయిగా బ్యాగ్ వేసుకుని టూర్లు తిరుగుతున్నాడు. అయితే ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉన్నాడు మ‌నోజ్. మొన్న ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై.. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో జ‌రిగిన ఇష్యూపై స్పందించాడు మ‌నోజ్. ఈ విష‌యంపై ట్వీట్ల‌తో పాటు వీడియో బైట్ కూడా ఇచ్చాడు మ‌నోజ్. ఇక ఇప్పుడు కూడా మ‌నోజ్ చేసిన ఓ పోస్ట్ కు క‌మెంట్ గా ఓ సినీ అభిమాని సెటైర్ వేసాడు. తండ్రి సంపాదించిన ఆస్తుల‌తో బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్ బ్రో.. దేనికైనా రాసిపెట్టి ఉండాలిలే.. ఎంజాయ్ అంటూ కాస్త వంక‌ర‌గా క‌మెంట్ పెట్టాడు. దానికి మ‌నోజ్ కు ఎక్క‌డో కాలింది. 

అందుకే దానికి స‌మాధానం ఇస్తూ మా నాన్న సంపాదించిన డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తే ఆయ‌న ఆనందంగానే ఫీల్ అవుతాడు.. కానీ నాకు ఎప్పుడూ ఆ అవ‌స‌రం రాలేదు.. కాలేజ్ లో ఉన్న‌పుడు వెయిట‌ర్, క్లీన‌ర్ గా కూడా ప‌నిచేసి నా డ‌బ్బులు నేనే సంపాదించుకున్నాను.. నా తొలి సినిమాకు కొత్త ద‌ర్శ‌కున్ని నేనే సెట్ చేసుకున్నాను.. ఎనీ డౌట్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ఆన్స‌ర్ చూస్తుంటేనే మ‌నోజ్ కు ఎంత కోపం వ‌చ్చిందో అర్థ‌మైపోతుంది. మొన్న కూడా ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై కులం ఇష్యూ గురించి మాట్లాడిన‌పుడు ఓ కుర్రాడు మ‌రి నువ్వెందుకు ఎస్సి అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు.. రెడ్డి అమ్మాయిని పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ అని అడిగాడు. దానికి మ‌నోజ్ స‌మాధానం ఇస్తూ ఎస్సీ అమ్మాయి అనే తేడాలెందుకు.. అయినా నీ కోసం ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకోలేను.. నీ ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్ ఇవ్వు నీకు అర్థ‌మ‌య్యే భాష‌లోనే మాట్లాడుకుందాం అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి సోష‌ల్ మీడియాలో వ‌చ్చే క‌మెంట్స్ ను చూసి వ‌దిలేయకుండా అందులో త‌న‌ను ఎఫెక్ట్ చేసే వాటికి స్వ‌యంగా రిప్లైలు కూడా ఇస్తున్నాడు మంచు మ‌నోజ్ కుమార్. 

More Related Stories