English   

'రొమాంటిక్'గా కనిపించనున్న మందిరా బేడీ !

Mandira-Bedi
2019-03-14 18:28:27

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ప్రస్తుతం రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఢిల్లీ బ్యూటీ కెతికా శర్మను ఖరారు చేస్తూ ఇటీవలే దర్శక నిర్మాతలు ప్రకటన విడుదల చేశారు. తాజాగా సినిమాలో మరో ముఖ్యమైన పాత్రను ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి, హిందీ టెలివిజన్ హోస్ట్ మందిరా బేడీ ఈ రొమాంటిక్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోందని ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. రొమాంటిక్ షూట్ మాత్రమే కాక ఇస్మార్ట్ శంకర్ షూట్ కూడా అక్కడే జరుగుతోంది. ఈ సందర్భంగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' 'రొమాంటిక్‌' టీమ్స్‌ కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తొలుత ఈ ఫోటోల్లో మందిరాబేడీ కనిపించింది. ఆమె ఏ సినిమా కోసం వీళ్ళతో జాయిన్ అయిందని జనాలు అనుకునే లోపే వీరు ప్రకటన విడుదల చేశారు. బాలీవుడ్‌లో చిన్న చిన్న పత్రాలు వేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మందిరా తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోంది.  

More Related Stories