English   

మణిరత్నంకి హార్ట్ ఎటాక్...కానీ ?

Mani Ratnam
2019-06-17 12:59:07

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు గుండెపోటు రావడంతోనే చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారని అంటున్నారు. పూర్తి వివరాలు బయటకి రాలేదు కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. నిజానికి మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. దీంతో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. నిజానికి 2004లో యువ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయనకు మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది. సెట్‌ లో ఉన్న వేళ, తన ఛాతిలో నొప్పిగా ఉందని ఆయన చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. ఆపై 2015 సంవత్సరంలో ఓకే బంగారం షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా అప్పుడు, ఇక రీసెంట్ గా 2018లో మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చిందని ప్రచారమ జరిగినా ఆ వార్తల్లో నిజం లేదని ఆయన ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. మణిరత్నం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన ప్రతినిధులు, ఆస్పత్రి వైద్యులు ప్రకటన చేశారు.  ఇక ఈరోజు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు ప్రచారమ జరిగినా ఈసారి కూడా అయన రొటీన్ చెకప్ కోసమే వెళ్లినట్టు ప్రకటన వెలువడింది. ఈ రోజు ఆయన ఆఫీస్ కి కూడా వెళ్లారట. ఇక ఆయన పొన్నియన్‌ సెల్వన్‌ అనే హిస్టారికల్ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

More Related Stories