English   

మెలోడీ బ్ర‌హ్మ ఈజ్ బ్యాక్.. 

Mani-Sharma

మెలోడి బ్ర‌హ్మ‌.. తెలుగులో ఈ పేరు ఒక్క మ‌ణిశ‌ర్మ‌కు త‌ప్ప మ‌రే సంగీత ద‌ర్శ‌కుడికి స‌రిపోదు. ఆయ‌న మాత్ర‌మే దీనికి అర్హుడు. ఇప్పుడు కాదు.. ఎప్ప‌టికైనా మ‌ణిశ‌ర్మ పాట‌లంటే ఆల్ టైమ్ ఫేవ‌రేట్ అంతే. కాక‌పోతే ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా ఓ టైమ్ వ‌ర‌కే అన్నీ న‌డుస్తాయి. మ‌ణిశ‌ర్మ టైమ్ ఇప్పుడు లేదు. అందుకే కుర్రాళ్ల‌కు వ‌దిలేసి తను హాయిగా కొన్ని సినిమాల‌కు ఆర్ఆర్ ఇస్తున్నాడు. ఒక‌ప్పుడు ఈయ‌న ప‌నిచేయ‌ని హీరో లేడు.. ద‌ర్శ‌కుడు లేడు. అప్ప‌ట్లో ఏ సినిమా చూసినా ఈయ‌న పేరు క‌న‌బ‌డాల్సిందే. ప‌దేళ్ల కాలంలోనే 110కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. ఈ మ‌ధ్య దేవీ, థ‌మ‌న్ కు తోడు కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి.. స్టార్ హీరోలు వీళ్ళ‌కు ప‌డిపోవ‌డంతో మ‌ణిశ‌ర్మ కాస్త సైలెంట్ అయిపోయాడు. గ‌తేడాది నితిన్ లై సినిమాతో పాటు మ‌రిన్ని సినిమాల‌కు ప‌ని చేసాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. 

2018లో కూడా వ‌ర‌స‌గా సినిమాలతో వ‌స్తున్నాడు మ‌ణిశ‌ర్మ‌. తాజాగా ఈయ‌న పాట‌లు స్వ‌ర‌ప‌రిచిన ఎమ్మెల్యే ఆడియో మార్చ్ 15న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌ణిశ‌ర్మ మార్క్ ఇందులో క‌నిపించింది. ఇక గ‌త రెండేళ్లుగా జెంటిల్ మ‌న్.. లై లాంటి సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు మణి. ఈ మ‌ధ్యే ఈయ‌న చేతుల్లోకి భారీ ప్రాజెక్ట్ ఒక‌టి వ‌చ్చింది. అదే నాని-నాగార్జున సినిమా. దీనికి సంగీత ద‌ర్శ‌కుడిగా మ‌ణిశ‌ర్మ‌నే తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఈయ‌న గ‌త సినిమా శ‌మంత‌క‌మ‌ణికి కూడా ఆయ‌నే సంగీతం అందిం చాడు. దానికితోడు నాని, నాగార్జున‌తో మ‌ణిశ‌ర్మ‌కు మంచి హిట్ కాంబినేష‌న్. దాంతో మ‌ణి వైపు అడుగేస్తున్నాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్. చూడాలిక‌.. ఈ ఏడాదైనా మ‌ళ్లీ మ‌ణిశ‌ర్మ ఈజ్ బ్యాక్ అనిపిస్తాడో లేదో..?

More Related Stories