English   

క్రిష్ ఏం ప్లాన్ చేసాడు గురూ..?

Manikarnika-first-look
2018-08-16 18:07:33

ఒకే ద‌ర్శ‌కుడి నుంచి రెండు బ‌యోపిక్ లు.. రెండు వారాల్లో రావ‌డం నిజంగా అద్భుత‌మే. ఇప్పుడు ఇది చేసి చూపించ‌డానికి రెడీ అయ్యాడు క్రిష్.  ఇప్పుడు ఆగ‌స్ట్ 15 కానుక‌గా రెండు సినిమాల ఫ‌స్ట్ లుక్ లు కూడా ఒకేసారి తీసుకురావ‌డం అద్భుత‌మే. అదీ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.  ఒకేసారి రెండు భారీ సినిమాలు వ‌స్తున్నా కూడా ఏ మాత్రం టెన్ష‌న్ లేకుండా కూల్ గా ఎంలా ఉంటాడ‌నేది క్రిష్ ని చూసి నేర్చుకోవాలి. ఆగ‌స్ట్ 14 సాయంత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బాల‌య్య ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు.. ఇక పంద్రాగ‌స్ట్ రోజు కంగ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు క్రిష్. ఈ రెండింటికి అద్భుతం అనే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మొండిధైర్యంతోనే అటు ఇటు ప‌ని చేస్తూనే ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు బాల‌య్యకు కూడా క్రిష్ పై న‌మ్మ‌కం అలా ఉంది మ‌రి. అందుకే తేజ చేతుల్లోంచి తీసుకెళ్లి ఎన్టీఆర్ బ‌యోపిక్ ను అలా క్రిష్ చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అదొచ్చిన రెండు వారాల‌కు.. అంటే జ‌న‌వ‌రి 26న మ‌ణిక‌ర్ణిక కూడా విడుద‌ల కానుంది. ఏ సినిమాపై ఆస‌క్తి త‌గ్గ‌కుండా రెండు ఫ‌స్ట్ లుక్ ల‌ను అద్భుతంగా డిజైన్ చేయించాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఈ రెండు బ‌యోపిక్ లతో క్రిష్ రేంజ్ మ‌రింత పెరిగి పోవ‌డం ఖాయం. 

More Related Stories