English   

మణికర్ణిక రివ్యూ

Manikarnika
2019-01-25 09:50:09

ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. కొందరు సినీ నటులు, క్రీడా కారుల జీవితాలను తెరకెక్కిస్తుంటే మరికొందరు మాత్రం మనకు తెలియని చరిత్రని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కోవలో వచ్చిన పద్మావత్ ఘన విజయం సాదించడంతో ఝాన్సీ రాణి లక్ష్మీ భాయిగా మనకు సుపరిచితమయిన మణికర్ణిక జీవిత చరిత్ర ఆధారంగా హిస్టారికల్‌ మూవీగా మణికర్ణిక తెరకెక్కించారు. రోజుకొక వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాకు సింహ భాగం క్రిష్‌ దర్శకత్వం వహించటం, తరువాత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న కంగనా రనౌత్‌ కథతో పాటు క్రిష్ తీసుకున్న నటీనటులను కూడా మార్చటం వివాదాస్పదంగా మారింది. బాహుబలి రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించిటంతో టాలీవుడ్‌లోనూ మణికర్ణికపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఆ అంచనాలు మణికర్ణిక అందుకుందా ? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

చిన్నప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళందరికీ ఈ కధ ముందే తెలుసు. దానినే ఎమోషన్స్ జోడించి సినిమాటిక్‌ గా ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేసింది మణికర్ణిక టీం. కధలోకి వెళితే బెనారస్‌లోని బితూర్‌లో పుట్టి పెరిగిన మణికర్ణిక (కంగనా రనౌత్‌)కు ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్‌ రావు (జిషు సేన్‌గుప్తా)తో వివాహమవుతుంది. ఝాన్సీ రాజ్యానికి వెళ్లాక మణికర్ణికకు లక్ష్మీబాయిగా పేరు మార్చేస్తారు. దీంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా రాజ్యంలోని ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకుంటుంది. అదే సమయంలో లక్ష్మీబాయి జీవితంలోనూ కల్లోలం మొదలువుతుంది. భర్త మరణించటంతో కొంతమంది నమ్మకస్తుల సాయంతో రాజ్యాధికారాన్ని లక్ష్మీబాయి తీసుకుంటుంది. రాజ్యానికి సరైన వారసురాలు అని అందరూ ప్రశంసిస్తుంటారు. అదే సమయంలో భారతదేశంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ తన రాజ్య కాంక్షతో ఆక్రమించుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకునేందుకు బ్రిటీష్‌ పాలకులు చేసే ప్రయత్నాలను లక్ష్మీబాయి తిప్పికొడుతుంది. వారితో చర్చలకు నిరాకరిస్తుంది. దీంతో అహం దెబ్బతిన్న బ్రిటీష్‌ పాలకులు ఝాన్సీని ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఎత్తులు వేస్తారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? ఝాన్సీ రాణిగా మారిన మణికర్ణిక ఆంగ్లేయులను ఎలా ఎదిరించింది ? చివరకు ఏమయ్యింది..? అన్నదే మిగత కథ. 

కథనం:

సినిమా మొదలుపెట్టినప్పటి నుండి అసలు కథను మొదలు పెట్టడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు. దాదాపు ఫస్ట్‌ హాఫ్ అంతా మణికర్ణిక పాత్రను ఎలివేట్ చేసేందుకు, ఆమెను స్వతంత్రభావాలు ఉన్న భయం లేని మహిళగా చూపించేందుకే సరిపెట్టారు. ఆమె ఝాన్సీ రాణిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కథనం కాస్త స్పీడందుకున్న భావన కలిగినా పాటలు కథ గమనానికి అడ్డుపడుతుంటాయి. గ్రాఫిక్స్‌ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. కొన్ని సీన్స్‌ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఫస్ట్ హాఫ్ ముగుసినా సెకండ్‌ హాఫ్ లోని ఎమోషనల్‌ సీన్స్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. పోరాట సన్నివేశాలు బాగా వచ్చాయి. క్లైమాక్స్‌ సూపర్బ్‌ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. అప్పటి పరిస్థితులను వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. సినిమాటోగ్రాఫీ ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపించింది. సంగీతం మాత్రం సోసో. పాటలు అంతగా ఆకట్టుకోలేపోయినా ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త కత్తెరకి పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు :

ఝాన్సీ రాణి పాత్రలో కంగనా రనౌత్‌ జీవించింది. ఈ సినిమాలో ఆమె తన నట విశ్వరూపం చూపించింది. యుక్తవయసులో చిరునవ్వుతో ఆనందంగా గడిపిన మణికర్ణిక నుంచి రణరంగంలో కత్తి దూస్తూ రౌద్ర రూపం దాల్చిన లక్ష్మీబాయి వరకు ఆమె జీవితంలో ఎన్ని రకాల పాత్రల మాడ్యులేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కంగనా చూపించి మెప్పించింది. వీరనారిగా కత్తి దూసే సన్నివేశాల్లో కంగనా నటవిశ్వరూపం చూపించింది. ఇక కీలక పాత్రలలో నటించిన వారంతా తమ తమ పరిధుల మేర బానే నటించారు.

చివరగా : ‘మణికర్ణిక’ భారత నారి వీరత్వానికి ప్రతిరూపం. 

రేటింగ్: 3/5

More Related Stories