English   

తెలుగోళ్లంతా వేస్ట్ ఫెలోసేనా.

manjula-manasukunachindi
2018-02-17 19:06:23

మాట పెదవి దాటితే వచ్చే ప్రమాదం ఊహించే దాన్ని వదలాలి. లేదంటే ప్రాబ్లమ్స్ తప్పవు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ దాన్ని ఓవర్ గా ఎక్స్ బిట్ చేయకూడదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో. బ్యాక్ గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. చేస్తోన్న పనిలో పసను బట్టే రిజల్ట్ ఉంటుంది తప్ప.. బ్యాక్ గ్రౌండ్ ను బట్టి కాదు. ఈ విషయం తెలియక కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో టంగ్ స్లిప్ అయిన దర్శకురాలు మంజుల. కృష్ణ కూతురుగా, మహేష్ అక్కగా ఆమె డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ మనసుకు నచ్చింది నిన్న విడుదలైంది. కానీ ఎవరికీ నచ్చలేదు. అయితే సినిమా ప్రమోషన్స్ లో మంజుల ఈ సినిమా నచ్చనోళ్లు ‘వేస్ట్ ఫెలోస్’ అనేసింది.  నిజానికి ఇది చాలా పెద్ద మాట. ఆ మాట అంటున్నప్పుడు ఆమె ఏ ట్రాన్స్ లో ఉందో కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ మాట విపరీతంగా ట్రోల్ అవుతోంది. మంజుల మాటలను ఉటంకిస్తూ చాలామంది సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్స్ వేస్తున్నారు. 

మనసుకు నచ్చింది నాకు నచ్చలేదు.. సో నేనో వేస్ట్ ఫెలో అంటూ ఎవరికి వారు సెల్ఫ్ సెటైర్ వేసుకుంటూ మంజుల మాటలతో ఓ ఆటాడేసుకుంటున్నారు. నిజానికి ఈ కథ ఎవరికీ పెద్దగా నచ్చలేదు. ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ నవ్వేస్తున్నారు. ఇది చాలు మంజుల దర్శకత్వ ప్రతిభ తెలియడానికి. నేచర్ ను ప్రేమించమంది. యోగా చేయమంది. ఈ మాటలు చెప్పడానికి సినిమానే తీయక్కర్లేదు. చిన్న షార్ట్ ఫిలిమ్ చాలు. కానీ మంజుల మాట జారింది. ఇప్పుడు సోషల్ మీడియా తాకిడికి మౌనంగా మారింది. ఏదేమైనా ముందు నోరు జారడం ఎందుకు ఇప్పుడు బాధపడటం ఎందుకు..

More Related Stories