English   

మహేష్ ఫ్యాన్స్ ను మంజుల హర్ట్ చేస్తోందా..?

manjula-mahesh

ఇండస్ట్రీలో అన్ని ఫ్యామిలీస్ కంటే సూపర్ స్టార్ ఫ్యామిలీ వేరు. హీరో కృష్ణ సంపాదించుకున్న అభిమానులు ఆతర్వాత అదే ప్రేమను మిగతా ఫ్యామిలీ ఆర్టిస్టులపైనా చూపిస్తున్నారు. ఇక తనదైన టాలెంట్ ఆ ఫ్యాన్ బ్యాంక్ ను డబుల్ చేసుకున్నాడు మహేష్ బాబు. తండ్రి తర్వాత సూపర్ స్టార్ ట్యాగ్ కు తనే పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేస్తూ దూసుకుపోయాడు. అయితే లేటెస్ట్ కృష్ణ కూతురు మంజుల.. ‘మనసుకు నచ్చింది’ అనే సినిమా డైరెక్ట్ చేసింది. ఈ మూవీ ఈ నెల 16న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తోన్న ప్రమోషన్స్ లో ఆమె తరచూ పవన్  కళ్యాణ్ పేరు జపిస్తోంది. తన వద్ద పవన్ కు సరిపోయే ఓ పర్ఫెక్ట్ స్టోరీ ఉందనీ.. ఆయన ఒప్పుకుంటే సినిమా చేస్తానని చెబుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది మహేష్ ఫ్యాన్స్. కానీ తను పవన్ నామస్మరణ చేస్తోంది. దీంతో ప్రిన్స్ అభిమానులు హర్ట్ అవుతున్నారట. మహేష్ లాంటి సూపర్ స్టార్ ఉండగా ఇప్పుడు పవన్ పేరుతో ప్రమోషన్స్ లో అటెన్షన్ తీసుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనేది వారి ఫీలింగ్. 

మరోవైపు ఆమె ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నా సినిమా నచ్చకపోతే వారికి హార్టే లేదనీ.. వారంతా వేస్ట్ ఫెలోస్ అనీ అంటోంది. నిజానికి కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇంత రాష్ గా ఎవరూ లేరు. చివరికి ఆయన అల్లుడు సుధీర్ బాబుతో సహా. మరి ఈవిడెందుకు ఇలా సీరియస్ అవుతుందోనని ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారట. బ్లాక్ బస్టర్ సినిమా కూడా అందరికీ నచ్చాలని లేదు. అలాంటిది తన సినిమా నచ్చకపోతే వేస్ట్ ఫెలోస్ అనడం ఎంత వరకూ కరెక్టో. ఏదేమైనా మంజుల తీరుతో మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారట. అన్నట్టు ఈ విషయంపై తను క్లారిటీ కూడా ఇచ్చింది. కానీ అది కూడా ఏమంత కన్విన్సింగ్ గా లేదు. మరి మంజుల నెక్ట్స్ సినిమా కూడా తీస్తుందా లేదా అనేది చూడాలి. 

More Related Stories