English   

ఆ ఇద్దరికి హిట్ పడితే హ్యాట్రిక్ అవుతుంది

Mass Maharaja Ravi Teja Director Srinu Vaitla Wants A Blockbuster Hit
2018-11-15 16:46:18

ఏమో ఇప్పుడు అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆస‌క్తితో ఉన్నారు. ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా విడుద‌లయ్యే ముందు ఉండే ఆస‌క్తి అయితే ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఇక శ్రీనువైట్ల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని అయితే లేదు. మూడేళ్ల కింద ఈయ‌న సినిమా అంటే ఎగ‌బ‌డి మ‌రీ చూసేవాళ్లు ప్రేక్ష‌కులు.. అభిమానులు. కానీ ఇప్పుడు మాత్రం కాదు. అదే రొడ్డ‌కొట్టుడు రొటీన్ క‌థ‌లతో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టి ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నాడు వైట్ల‌. ఏదో కొత్త క‌థ‌తోనే వ‌స్తున్నాడు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అంటూ ర‌వితేజ‌తో స్టైలిష్ ఎంట‌ర్టైనర్ చేసాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర విడుద‌ల మ‌రికొన్ని గంట‌ల్లో కానుంది.

పైగా ఇద్ద‌రూ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉండ‌టంతో ఆస‌క్తి కూడా పెరిగిపోయింది. ర‌వితేజ గ‌త రెండు సినిమాలు ట‌చ్ చేసి చూడు.. నేల‌టికెట్ క‌నీసం 10 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయాయి. ర‌వితేజ మార్కెట్ ఎలా ప‌డిపోయిందో ఈ రెండు సినిమాలే సాక్ష్యం. దాంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టి త‌న మార్కెట్ నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ప‌డిపోయాడు మాస్ రాజా. ఇలాంటి టైమ్ లో హిట్ల‌లో ఉన్న ద‌ర్శ‌కుడితో సినిమా చేయాలి కానీ ర‌వితేజ మాత్రం హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చిన శీనువైట్ల‌తో సినిమా చేస్తున్నాడు. దాంతో శీనువైట్ల‌కు కూడా ఇప్పుడు ఈ చిత్రం కీల‌కంగా మారింది. హిట్టైతే వెంకీ, దుబాయ్ శీను త‌ర్వాత హ్యాట్రిక్ మూవీగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ నిల‌బ‌డుతుంది. లేదంటే ర‌వితేజ‌కు ట‌చ్ చేసి చూడు, నేల‌టికెట్ త‌ర్వాత హ్యాట్రిక్.. శీనువైట్ల‌కు దిగ్విజ‌యంగా రెండో హ్యాట్రిక్ ఫ్లాపుల‌కు నాందీగా నిల‌బ‌డిపోతుంది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.

అలా కాకుండా విజ‌యాల హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు ఈ ఇద్ద‌రూ. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అనే టైటిల్ ఉన్నా ఇందులో ర‌వితేజ చేస్తున్న‌ది మూడు పాత్ర‌లు మాత్రం కాదు. ఆ టైటిల్ ఎందుకు పెట్టామ‌నేది థియేట‌ర్ కు వ‌చ్చి తెలుసుకోండి అంటూ ఫ‌జిల్ వ‌దిలాడు శీనువైట్ల‌. అయితే ఇప్పుడు వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ముగ్గురిలా క‌నిపించి.. బ్రేక్ టైమ్ కు తూచ్ అంతా ఒక్క‌రే అని చూపిస్తాడ‌ని తెలుస్తుంది. అందుకే ఈ మూడు పేర్లు ఉండేలా టైటిల్ పెట్టాడు వైట్ల‌. మ‌రి చూడాలి.. ఈ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ర‌వితేజ‌, శీనువైట్ల‌ను బ‌య‌ట ప‌డేస్తారో లేదో..?

More Related Stories