English   

ఈ కుర్రాన్ని కాస్త గుర్తు ప‌ట్టండి..

master bharath
2018-06-13 07:56:33

ఎవ‌రీ కుర్రాడు.. అరె ఎక్క‌డో చూసిన‌ట్లున్నాడే.. ఆ గుర్తొచ్చింది.. ఈ కుర్రాడు ఆ కుర్రాడే క‌దా..! అవును.. ఆ కుర్రాడే.. క‌చ్చితంగా ఆ కుర్రాడే. మీరు ఊహించింది నిజ‌మే.. ఈ కుర్రాడు ఆ కుర్రాడే.. ఆ కుర్రాడి పేరే భ‌ర‌త్. రెడీ సినిమాలో ఏమిరా చిట్టినాయుడు అంటూ రామ్ ఆడుకున్నాడు క‌దా.. వాడే వీడు.. వీడే వాడు. చిన్న‌పుడే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 40 సినిమాల‌కు పైగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన భ‌ర‌త్.. ఇప్పుడు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవుతున్నాడు. తాజాగా అల్లుశిరీష్ కొత్త సినిమా ఏబిసిడి రీమేక్ లో శిరీష్ తో పాటే ఉండే ఫుల్ లెంత్ రోల్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అల్లు శిరీష్ త‌న ట్విట్ట‌ర్ లో అనౌన్స్ చేసి.. భ‌ర‌త్ పోటోను కూడా షేర్ చేసాడు. ఇప్పుడు ఈ కుర్రాడి ఫోటో చూసి అంతా షాక్ అవుతున్నారు. అంత‌లోనే ఎంత పెద్దోడైపోయాడో అంటూ భ‌ర‌త్ ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ చిత్రంతో పాటు త‌మిళ్ లో కూడా భ‌ర‌త్ కు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. వీలుంటే హీరోగా కూడా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు ఈ కుర్రాడు. మ‌రి చూడాలిక‌.. ఈ చిట్టినాయుడు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎలా రాణిస్తాడో..? 

More Related Stories