English   

ఎన్టీఆర్, వైఎస్సార్ లకు మెగా సవాల్..

Mega challenge between ntr and ysr
2018-05-29 14:40:08

ఎన్టీఆర్ పీక్స్ లో ఉన్నప్పుడు వైఎస్సార్ కు అంత రేంజ్ లేదు. వైఎస్సార్ పీక్స్ కు వచ్చేసరికి ఎన్టీఆర్ అసలే లేడు. ఇప్పుడు వైఎస్సార్ కూడా లేడు.  మరి ఈ ఇద్దరికీ కాంట్రాస్ట్ ఎక్కడుందీ అనుకుంటున్నారా..? ఉంది.. వచ్చే సంక్రాంతికి ఈ ఇద్దరి మధ్యా యుద్ధం జరగబోతోంది. అయితే అది బ్యాలెట్ వార్ కాదు.. బాక్సాఫీస్ వార్. యస్.. ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నందమూరి తారకరామారావు బయోపిక్ తెరకెక్కబోతోంది. క్రిష్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ బయోపిక్ టైటిల్ ఎన్టీఆర్. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను మమ్మూట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కించబోతున్నాడు. ఆనందోబ్రహ్మ అనే సినిమా తీసిన మహి వీ రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ యాత్ర. అయితే ఈ రెండు సినిమాలూ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. అవును.. ఈ రెండు బయోపిక్స్ మనల్ని సంక్రాంతికే పలకరించబోతున్నాయి. 

ఇక వచ్చే నెల రెండో వారం నుంచి యాత్ర షూటింగ్ మొదలవుతుంది. అలాగే జూలై నుంచి ఎన్టీఆర్ షూటింగ్ మొదలుకావొచ్చు. ఇప్పటికే ప్రధాన పాత్రలకు సంబంధించిన ఆర్టిస్టులను రెండు సినిమాలకూ ఫైనల్ చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తైంది. ఇక మిగిలింది షూటింగే. ఎన్టీఆర్ సినిమాకు క్రిష్ దర్శకుడు కాబట్టి.. ఖచ్చితంగా ఇన్ టైమ్ లోనే వస్తుంది. ఇటు పెద్దగా అనుభవం లేకపోయినా క్లారిటీ ఉన్న దర్వకుడు రాఘవ. సో ఇతనూ సంక్రాంతి వరకూ రెడీగా ఉంటాడు. అయితే ఈ ఇద్దరి మధ్యా సైరా అంటూ సవాల్ విసురుతోంది మాత్రం చిరంజీవి. 

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తోన్న సైరా నరసింహారెడ్డి కూడా ఒక రకంగా బయోపిక్కే. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథగా వస్తోన్న ఈ సైరా నరసింహారెడ్డి కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో భారీ తారాగణం ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ఈ సైరాకు కూడా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. అందుకే షూటింగ్ ముందే పూర్తయినా ఆ గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. అన్ని నిదానంగా పూర్తి చేసుకుని ది బెస్ట్ క్వాలిటీతోనే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. సో.. ఎన్టీఆర్ అండ్ వైఎస్సార్ లకు మెగా షాక్ తప్పేలా లేదు. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో విన్ అయ్యే బయోపిక్ ఎవరిదో.. 

More Related Stories