English   

అవ‌కాశాల్లేని మెగా మేన‌ల్లుడు..

2017-04-01 08:12:02

సినిమా ఇండ‌స్ట్రీ నిజంగానే ఓ వైకుంఠ పాళి. ఎప్పుడు నిచ్చెన ఎక్కిస్తుందో.. ఎప్పుడు పాము నోట్లో ప‌డేస్తుందో తెలియ‌దు. కావాలంటే చూడండి.. మొన్న‌టి వ‌ర‌కు వ‌ర‌స విజ‌యాల‌తో.. సూప‌ర్ స్పీడ్ లో ఉన్న సాయిధ‌రం తేజ్ కెరీర్ ఇప్పుడు ఉన్న‌ట్లుండి ప‌డిపోయింది. తిక్క‌, విన్న‌ర్ సినిమాల ఫ‌లితాల‌తో.. సుప్రీమ్, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్లు కూడా నిల‌బ‌డ‌లేక‌పోయాయి. ఆ సినిమాల‌తో వ‌చ్చిన క్రేజ్, మార్కెట్.. ఈ ఫ్లాపుల‌తో పోయాయి ఇప్పుడు ఆట మ‌ళ్లీ మొద‌ట్నుంచీ మొద‌లుపెట్టాడు ఈ మెగా మేన‌ల్లుడు. కానీ ఆడ‌దామంటే చేతిలో సినిమాలు కూడా ఎక్కువ‌గా లేవు. ప్ర‌స్తుతం సాయి చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా జ‌వాన్.

హీరోగా ప్ర‌స్తుతం చాలా డ‌ల్ పీరియ‌డ్ లో ఉన్నాడు సాయిధ‌రంతేజ్. వ‌ర‌స‌గా తిక్క‌, విన్న‌ర్ సినిమాలు నిరాశ ప‌ర‌చ‌డంతో సాయి కెరీర్ ఒక్క‌సారిగా డౌన్ అయిపోయింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన విన్న‌ర్ కూడా నిరాశ ప‌ర‌చ‌డం సాయి ఇమేజ్ ను దెబ్బ‌తీసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా 16 కోట్లు వ‌సూలు చేసింది. దీన్నిబ‌ట్టే సాయి మార్కెట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ హీరో బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో జ‌వాన్ సినిమా చేస్తున్నాడు. ఇది సెట్స్ పైకి వెళ్ల‌క‌ముందే కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్రం సినిమా చేసాడు సాయి. ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో మెరుస్తున్నాడు సాయిధ‌రంతేజ్. కేవలం కేవీ కోస‌మే ఈ రోల్ చేస్తున్నాడు సాయి. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించాడు ఈ కుర్ర హీరో. తాజాగా కొన్ని లుక్స్ విడుద‌ల‌య్యాయి. 15 నిమిషాలు ఉండే ఈ పాత్ర సినిమాలో చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. న‌క్ష‌త్రంలో హీరో సందీప్ కిష‌న్ అయినా.. సాయిధ‌రంతేజ్ పాత్ర‌నే ప్ర‌మోష‌న్ కోసం ఎక్కువ‌గా వాడేస్తున్నారు. చూడాలి మ‌రి.. న‌క్ష‌త్రంతో ఎవ‌రి స్టార్ ఎలా మార‌నుందో..?

More Related Stories