English   

సూపర్ స్టార్ కృ‌ష్ణకు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్..

chiru
2020-05-31 12:50:08

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత తాను చేయాలనుకున్న పనులు అన్నీ చేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరి పుట్టిన రోజు అయినా వస్తే వాళ్ళను పర్సనల్ గా విష్ చేసేవాడు మెగాస్టార్. ఆయన చెప్పాడో లేదో వాళ్లిద్దరికే తెలిసేది. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసేలా చేస్తున్నాడు చిరంజీవి. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు కూడా ఇలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మెగాస్టార్. ఆయన ట్విట్టర్ వేదికగా కృష్ణ కెరీర్ లో సాధించిన ఘనతల గురించి చెప్పుకొచ్చాడు.. వాటిని మరోసారి గుర్తు చేసాడు.

కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70ఎం ఎం చిత్రం కూడా ఆయనదే. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత,సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసాడు చిరంజీవి. నటుడిగా, దర్శకుడిగా మరియు నిర్మాతగా కృష్ణ బహుముఖ ప్రజ్ఞను చిరంజీవి కొనియాడడం గమనార్హం. తనకు కృష్ణ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా యిష్టమని చెప్పుకొచ్చాడు చిరంజీవి. అలాగే ఓ వేడుకలో తామిద్దరు కలిసున్న ఫోటోను జత చేసాడు చిరంజీవి. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

More Related Stories