English   

టాలీవుడ్ కి అండగా పెద్దలు...కరోనా క్రైసెస్ చారిటీ

chiru
2020-03-29 18:10:21

దాసరి మరణం తరువాత టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న చిరంజీవి మరో సారి మంచి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపధ్యంలో అన్ని దేశాలతో సహా టాలీవుడ్ కూడా మూగబోయింది. రోజూ షూటింగ్లు, రిలీజులు అంటూ సందడిగా ఉండే టాలీవుడ్ కరోనా దెబ్బకు మూలాన పడింది. అయితే సినిమాకి లక్షల్లో డబ్బు తీసుకునే నటీనటులు, టెక్నీషియన్స్ పరిస్థితి పర్లేదు కానీ ఆరోజు పని చేస్తే కానీ రోజు గడవని వారు కూడా సినిమా పరిశ్రమలో చాలా మంది ఉంటారు. లైట్ బాయ్స్ దగ్గర నుండి, జూనియర్ ఆర్టిస్ట్ లు దాకా, స్టంట్ మ్యాన్ నుండి 24 విభాగాలలో వీరు పాతుకుని ఉన్నారు. వారు లేకుంటే సినిమా లేదు. అందుకే వారిని ఆడుకోవడానికి ప్రభుత్వాని కంటే ముందే సినిమా పరిశ్రమ ముందుకు వచ్చింది. సీసీసీ (కరోనా క్రైసెస్ చారిటీ) అనే సంస్థని చిరు ఆధ్వర్యంలో స్థాపించబడింది. దీని ద్వారా పేద సినీ కళాకారుల్ని ఆదుకోబోతున్నారు. ప్రభుత్వానికి అని కాకుండా సినిమా కార్మికుల కోసం అంటూ మన టాలీవుడ్ సినీ తారలు ప్రకటించిన విరాళాల్ని ఈ సంస్థ కిందకే చేర్చి దాన్ని క్రమ పద్ధతిలో కొన్ని కార్యక్రమాల ద్వారా సినీ కార్మికులకు చేయూత నివ్వడానికి చిరు ఆధ్వర్యంలోని ఈ టీం పని చేయనుంది. చిరంజీవి అధ్యక్షులుగా ఉన్న ఈ టీమ్ కి తమ్మారెడ్డి భరద్వాజా, సి.కల్యాణ్‌, ఎన్‌.శంకర్‌, సురేష్ బాబు, దామూలు సభ్యులుగా వ్యవహరిస్తారు. 

More Related Stories