English   

చిరు అంత రిస్క్ తీసుకుంటాడా..?

Megastar-Chiranjeevi
2018-08-22 14:38:01

స్టార్  డైరెక్ట‌ర్ తో సినిమా అన్న‌పుడు స్టార్ హీరోల‌కు కూడా అప్పుడ‌ప్పుడూ కొన్ని తిప్ప‌లు త‌ప్ప‌వు. అప్పుడ‌ప్పుడు ద‌ర్శ‌కుల‌కు కూడా ఈ తిప్ప‌లు ఉంటాయి. వాటిని అధిగ‌మిస్తే కానీ ముందుకు వెళ్ల‌లేరు. ఇప్పుడు చిరంజీవి, కొర‌టాల‌కు ఇదే తిప్ప‌లు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. గ‌తేడాది మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ కూడా ఓ వైపు స్పైడ‌ర్ చేస్తూనే మ‌రోవైపు కొర‌టాల‌తో భ‌ర‌త్ అనే నేను షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు మ‌రోసారి కొర‌టాల శివ కోస‌మే మ‌రో స్టార్ హీరోకు ఈ క‌ష్టాలు క‌నిపిస్తున్నాయి క‌ళ్ల ముందు. ఆయ‌నే మ‌న మెగాస్టార్. ఈయ‌న ప్ర‌స్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. 

ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. కొత్త షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేస్తున్నారు. అక్క‌డే నెల రోజులు జ‌ర‌గబోతుంది. దీనికోసం 50 మంది టీం వెళ్తున్నారు అక్క‌డికి. ఈ భారీ షెడ్యూల్ లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ కుడు సురేంద‌ర్ రెడ్డి. ఇందులో చిరంజీవితో పాటు విజ‌య్ సేతుప‌తి, అమితాబ్, సుదీప్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి స్టార్ క్యాస్ట్ అంతా పాల్గొన బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ స‌గం పూర్తి అయిపోయింద‌ని చెప్పాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. డిసెంబ‌ర్ నాటికి మొత్తం పూర్తి చేయాల‌ని చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రం సెట్స్ పై ఉండ‌గానే కొర‌టాల శివ‌తోనూ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు మెగాస్టార్. ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించాడు మెగాస్టార్. ఇప్పుడు కొర టాల ఇదే ప‌నిమీద బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రం కూడా ఇదే ఏడాది ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తుంది. మ‌రీ ఏడాది పాటు కొర‌టాల‌ను వెయిట్ చేయించ‌డం బాగోద‌ని భావించిన చిరు.. అన్నీ కుదిర్తే డిసెంబ‌ర్ నుంచే కొర‌టాల సినిమా మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు. అయితే ఇలా చేయ‌డం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. సైరాలో చిరు గ‌డ్డం.. జుట్టుతో క‌నిపిస్తాడు. అదే లుక్ ఇక్క‌డా ఉండాల‌ని లేదు. అందుకే వీలైనంత త్వ‌ర‌గా సైరా టాకీ పూర్తి చేసి కొర‌టాల కోసం వ‌చ్చేయాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. మ‌రి చూడాలిక‌.. ఆ సినిమా ఎప్పుడు పూర్త‌య్యేనో.. కొర‌టాల కోసం మెగాస్టార్ ఎప్పుడు వచ్చేనో..? 

More Related Stories