English   

జ‌గ‌న్ స‌ర్కార్ పై చిరు ప్ర‌శంస‌ల జ‌ల్లు

Chiranjeevi
2021-06-23 14:14:29

కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు తెలిసిందే. ఈ పరిస్థితులను అదుపు చేయడానికి దేశంలో చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించి క‌రోనా క‌ట్టడి చేయ‌డానికి ప్ర‌భుత్వాలు ప్రయత్నించాయి. గత కొన్ని రోజులుగా దేశంలో కేసులు తగ్గుముఖం పడుతుండడం వల్ల లాక్ డౌన్ లను కూడా రాష్ట్రాలు ఎత్తి వేస్తున్నాయి. దేశంలో కేసులు పెరగడానికి వ్యాక్సినేషన్ లు సరైన సమయంలో ప్రజలకు లేకపోవడమే అంటూ చాలా మంది రాజకీయ నాయకులు ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశారు. కాగా విమ‌ర్ష‌ల‌ను తిప్పి కొట్టేలా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగ‌వంతం చేసింది. 

అంతే కాకుండా వ్యాక్సినేష‌న్ కోసం ఓప్ర‌ణాళికను ఏర్పాటు చేసుకుని ఒకే రోజు ఎనిమిది లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించించాల‌ని నిర్ణ‌యించింది. కానీ ఒకరోజు లోనే జగన్ ప్రభుత్వం 13.7 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. దీని పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై ఆయ‌న పాల‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన అద్భుతం , కరోనా సమయంలో మీ ఆలోచనలు మీరు తీసుకున్న నిర్ణయాలు నాకు ఎంతో ఆనందాన్ని కలగజేశాయి. ముఖ్యంగా మీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక యజ్ఞంలా నడిచింది. ఇలానే ఈ ప్రక్రియను రాష్ట్రం మొత్తం పూర్తి అయ్యే వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను, అంటూ చిరంజీవి పేర్కొన్నారు. 
 

More Related Stories