English   

బంబాట్ పోరి మ‌స్త్ మ‌స్త్ గా ఉందే..!

Chal-Mohan-Ranga
2018-02-13 12:37:58

మేఘాఆకాశ్.. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. కొన్ని రోజుల్లో ఈ బ్యూటీ పేరు తెలుగు ఇండ‌స్ట్రీలో మారుమోగిపోవ‌డం ఖాయం. లై సినిమాతో ఇప్ప‌టికే తెలుగులో పాగా వేసింది మేఘా. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో ఆమె అందాలు మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. బంబాట్ పోరి సోకులు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. లై డిజాస్ట‌ర్ అయినా కూడా ఆమెకు వెంట‌నే మ‌రో అవ‌కాశం ఇచ్చాడు నితిన్. ప్ర‌స్తుతం ఈయ‌న‌తోనే క‌లిసి ఛ‌ల్ మోహ‌న‌రంగ‌లో న‌టిస్తుంది మేఘా. ఈ చిత్రం కానీ హిట్ అయిందంటే మేఘా క‌చ్చితంగా తెలుగులో క్రేజీ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయం. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో కూడా గ్లామ‌ర్ అంతా ఒల‌క‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ భామ‌కు అందాల ఆర‌బోత‌లో కూడా పెద్ద‌గా ప‌ట్టింపుల్లేవు. రౌడీఫెల్లో ఫేం కృష్ణ‌చైత‌న్య ఛ‌ల్ మోహ‌న‌రంగాకు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి క‌థ త్రివిక్ర‌మ్ అందిస్తున్నాడు. ఇక నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడు. ఆయ‌న‌తో పాటు సుధాక‌ర్ రెడ్డి, త్రివిక్ర‌మ్ కూడా ఉన్నారు. ఎప్రిల్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి ఈ బ్యూటీ జాత‌కం తెలుగులో ఎలా మార‌నుందో చూడాలిక‌..!

More Related Stories