English   

మెహబాబూ.. అంత తొంద‌రేంట‌బ్బా..?

Mehbooba Telugu Movie

కొంద‌రంతే మార‌రు.. అంత ఈజీగా వాళ్ల వ‌ర్కింగ్ స్టైల్ మార‌దు.. ఈ లిస్ట్ లో పూరీ జ‌గ‌న్నాథ్ ముందుంటాడు. హీరో మారిన తీరు మార‌లేదు.. కొడుకు వ‌చ్చినా జోరు త‌గ్గ‌లేదు.. ఇప్పుడు పూరీ స్టైల్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. హీరో ఎవ‌రైనా త‌న స్పీడ్ మాత్రం త‌గ్గించుకోవ‌ట్లేదు ఈ ద‌ర్శ‌కుడు. కొడుకు సినిమా కదా.. కాస్త ఆలోచించి టైమ్ తీసుకుంటాడేమో అనుకుంటే.. ఊహూ లేదు త‌న‌కు ఎవ‌రైనా ఒక‌టే అంటున్నాడు. మెహ‌బూబా షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ గా పూర్త‌యింది. అస‌లు ఊహించ‌డానికి కూడా వీల్లేనంత ఫాస్ట్ గా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ మ‌ధ్యే గుమ్మ‌డికాయ్ ఫంక్ష‌న్ కూడా చేసాడు పూరీ. పంజాబ్, ల‌డ‌క్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లాంటి ప్ర‌దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా  చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్.

ఈ మ‌ధ్య మ‌రీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడ‌ని పూరీపై విమ‌ర్శ ఒక‌టి వ‌చ్చింది. అందుకే కొడుకు కోసం కొత్త క‌థ‌ను ప‌ట్టుకొస్తున్నాడు పూరీ. ఈ చిత్రం 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో సాగుతుంది. అంటే 40 ఏళ్ల కింది క‌థ అంటే మొత్తం సాగుతుందనుకుంటే పొరపాటే. దీనికి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యం టచ్ ఇస్తున్నాడు పూరీ. హీరోతో పాటు హీరోయిన్ కూడా ఇండో పాక్ వార్ లో క‌న్నుమూసి.. ఇప్పుడు మ‌ళ్లీ జ‌న్మెత్తుతార‌ని తెలుస్తోంది. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పాక్ అమ్మాయిగా నేహాశెట్టి న‌టిస్తోంది. ఇండియ‌న్ అబ్బాయి.. పాక్  అమ్మాయి మ‌ధ్య ప్రేమ క‌థ అనేదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ చూసి పూరీ ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నాడ‌నే న‌మ్మ‌కం అయితే వ‌చ్చింది. ఈ రెండింటి మ‌ధ్య‌లో పూరీ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..? 2018 స‌మ్మ‌ర్ లో మెహ‌బూబా విడుద‌ల కానుంది.

More Related Stories