English   

మెహబూబా సాంగ్.. సూపర్

Naa-Pranam-Songs

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెహబూబా. ఆయన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్. ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్మీ అండ్ బోర్డర్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. సందీప్ చౌతా మ్యూజిక్ అందించిన మెహబూబాబాలోని ఓ పాటను గతంలో విడుదల చేశారు. ఇవాళ మరో సాంగ్ రిలీజ్ చేశారు. నా ప్రాణం ఏదో అన్నదీ..  అంటూ సాగే ఈ పాట కూడా అద్భుతం. సింపుల్ ఇన్ స్ట్రుమెంట్స్, ఆర్కెస్ట్రైజేషన్ తో అత్యంత మెలోడియస్ గా సాగుతుందీ పాట. పాడింది విజయశ్రీ వేణుగోపాల్. గాయని మాత్రమే కాదు.. ఆమె గాత్రమూ కొత్తగా  ఉంది. భాస్కర భట్ల సాహిత్యం అందించిన ఈ పాటలో అద్భుతమైన సాహితీ విలువలున్నాయి. కథానగుణంగా సాగే మాంటేజ్ సాంగ్ లా కనిపిస్తోందిది. మొత్తంగా ఈ మధ్య కాలంలో వినలేదు ఇలాంటిపాటలు అనిపిస్తోంది. నీ జతలోనే నాకు దొరికే ఓ సైన్యం అంటూ అద్భుతమైన లిరికల్ వాల్యూస్ ఉన్న ఈ పాట ఒక్కసారి వింటే చాలు.. అలా హాంట్ చేస్తూనే ఉంటుంది. 

More Related Stories