English   

ప్రివ్యూ: మెహ‌బూబా..

Mehbooba-Preview

కొంద‌రంతే మార‌రు.. అంత ఈజీగా వాళ్ల వ‌ర్కింగ్ స్టైల్ మార‌దు.. ఈ లిస్ట్ లో పూరీ జ‌గ‌న్నాథ్ ముందుంటాడు. హీరో మారిన తీరు మార‌లేదు.. కొడుకు వ‌చ్చినా జోరు త‌గ్గ‌లేదు.. ఇప్పుడు పూరీ స్టైల్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. హీరో ఎవ‌రైనా త‌న స్పీడ్ మాత్రం త‌గ్గించుకోవ‌ట్లేదు ఈ ద‌ర్శ‌కుడు. కొడుకు సినిమా కదా.. కాస్త ఆలోచించి టైమ్ తీసుకుంటాడేమో అనుకుంటే.. ఊహూ లేదు త‌న‌కు ఎవ‌రైనా ఒక‌టే అంటున్నాడు. మెహ‌బూబా షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ గా పూర్త‌యింది. ఇప్పుడు ప్ర‌మోష‌న్ కూడా మొద‌లు పెట్టేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట విడుద‌లైంది. నా ప్రాణం అంటూ సాగే ఈ పాట విడుద‌ల‌కు పూరీతో పాటు చిత్ర‌యూనిట్ అంతా వ‌చ్చింది. సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మాట్లాడాడు పూరీ జ‌గ‌న్నాథ్. ముఖ్యంగా ఈ చిత్రం త‌న కెరీర్ లోనే తొలిసారి చేసిన ఓ జ‌న్యూన్ సినిమా అని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే మెహ‌బూబా క‌చ్చితంగా పూరీకి క‌మ్ బ్యాక్ సినిమా అయ్యేలా ఉంది. 

ఈ మ‌ధ్య మ‌రీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడ‌ని పూరీపై విమ‌ర్శ ఒక‌టి వ‌చ్చింది. అందుకే కొడుకు కోసం కొత్త క‌థ‌ను ప‌ట్టుకొస్తున్నాడు పూరీ. ఈ చిత్రం 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో సాగుతుంది. అంటే 40 ఏళ్ల కింది క‌థ అంటే మొత్తం సాగుతుందనుకుంటే పొరపాటే. దీనికి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యం టచ్ ఇస్తున్నాడు పూరీ. హీరోతో పాటు హీరోయిన్ కూడా ఇండో పాక్ వార్ లో క‌న్నుమూసి.. ఇప్పుడు మ‌ళ్లీ జ‌న్మెత్తుతారు. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పాక్ అమ్మాయిగా నేహాశెట్టి న‌టిస్తోంది. ఇండియ‌న్ అబ్బాయి.. పాక్  అమ్మాయి మ‌ధ్య ప్రేమ క‌థ అనేదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ చూసి పూరీ ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నాడ‌నే న‌మ్మ‌కం అయితే వ‌చ్చింది. ఈ రెండింటి మ‌ధ్య‌లో పూరీ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..? మ‌రికొద్ది గంట‌ల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే ప‌డిన షోల‌ను బ‌ట్టి చూస్తుంటే టాక్ అయితే పాజిటివ్ గానే వ‌స్తుంది. 

More Related Stories