English   

మెహబూబా.. సూపరబ్బా..

Mehbooba-song

పూరీ జగన్నాథ్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మెహబూబా. తన తనయుడు ఆకాశ్ పూరీని హీరోగా పెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలోని ఓ సింగిల్ లిరికల్ సాంగ్ ను ఇవాళ విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట సింప్లీ సూపర్బ్. ‘ప్రేమలో పడ్డామనే లోపల, కళ్లకు కన్నీరేంటో కాపలా.. నువ్వు దూరమైతే నిశ్శబ్ధమైన ప్రతి రోజు యుద్ధం కదా.., మన మట్టి మీద పగబట్టి ఎవరు గీశారు సరిహద్దులు.. ప్రేమంటే తెలుసుంటే వాళ్లు ఈ గీత గీసుండరు’’.. అంటూ అద్భుతమైన లిరికల్ వాల్యూస్ తో సాగే ఈ సాంగ్ నిజంగా అదిరిపోయిందంతే. సందీప్ చౌతా సంగీతం అందించగా.. ఇప్పటి వరకూ తెలుగులో పెద్దగ పరిచయం లేని ప్రగ్యా దాస్ గుప్తా, సందీప్ బాత్రా ఆలపించారు. ఆకాశ్ పూరీ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫంక్షన్ లో ఆకాశ్ చెప్పినట్టు ఈ మూవీతో పూరీ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథగా వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ను బట్టే సినిమాటోగ్రఫీ రిచెస్ట్ గా ఉందనిపిస్తోంది. మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ఎస్సెట్ కాబోతోందనే ఈ పాట చూస్తేనే తెలుస్తోంది. మే 11న విడుదల కాబోతోన్న మెహబూబాతో పూరీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. 
 

More Related Stories