English   

మెహబూబా.. జిందాబాద్ .. 

Mehbooba-trailer
2018-04-10 14:00:33

పూరీ ఈజ్ బ్యాక్ .. మెహబూబా ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఇదే మాట అనేలా ఉన్నారు. పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాశ్ పూరీని హీరోగా పెట్టి తీసిన మెహబూబా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే పూరీ టేకింగ్ కు ఫిదా అయిపోవాల్సిందే.. టాలీవుడ్ స్టాండర్డ్స్ కే కాదు.. ఆకాశ్ పూరీ వంటి ఓ కొత్తకుర్రాడి కోసం ఇంత ఖర్చుపెట్టడం చూస్తే.. ఇది కేవలం కొడుకు కోసం మాత్రమే తీసిన సినిమా కాదు.. ఓ మంచి కథపై పూరీకి ఉన్న నమ్మకంగా కనిపిస్తోంది. మామూలుగానే బెస్ట్ రైటర్ అయిన పూరీ ఈ సారి తన స్టైల్ కు భిన్నగా ఫంకీ డైలాగ్స్ కాకుండా డిఫరెంట్ మాటలతో అలరించాడు. ఆ డైలాగ్స్ ట్రైలర్ లో చాలా బావున్నాయి. ట్రైలర్ లో వినిపించిన ‘‘దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో చిన్న చోటు దొరికినా చాలు.. అసలు ఈ సరిహద్దులనేవే లేకుంటే ఎంత బావుండేది.. మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం.. , షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అబ్దుల్ కలాం జిందాబాద్ అంటూ ఆఖర్లో మేరీ మెహబూబా జిందాబాద్’’ అంటూ చెప్పిన డైలాగ్స్ సూపర్బ్.. ఆకాశ్ డైలాగ్స్ చెబుతున్న విధానం కూడా చాలా ఇంటెన్సివ్ గా ఉంది. అతను కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆకాశ్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా సంగీత దర్శకుడు. సందీప్ మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటే, విష్ణుశర్మ అందించిన సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా కనిపిస్తోంది. మొత్తంగా బోర్డర్ లో సాగే ఈ ప్రేమకథలో ఎన్నో మలుపులున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. సో.. దిల్ రాజు విడుదల చేయబోతోన్న ఈ మెహబూబాతో పూరీ కొత్తగా ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

More Related Stories