English   

 మెహ‌బూబా ట్రైల‌ర్ టాక్.. అదిరింది..!

Mehbooba-Trailer
2018-04-09 16:39:08

ఎంత పెద్ద డాక్ట‌ర్ అయినా.. ఎన్ని ఆప‌రేష‌న్లు చేసినా.. సొండ కొడుక్కి ఆప‌రేష‌న్ చేయాలంటే మాత్రం క‌చ్చితంగా ప‌రేషాన్ అవుతుంటారు. ఇప్పుడు పూరీ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఎంత మంది హీరోల‌తో ప‌నిచేసినా.. ఎన్ని హిట్లు ఇచ్చినా కూడా సొంత కొడుకుతో సినిమా చేయ‌డం వేరు. పైగా తొలి సినిమా చేయ‌డం అనేది ఇంకా పెద్ద ప‌రీక్ష‌. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ కు ఇదే ఎదురైంది. ఈయ‌న త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరీని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాడు. దీనికోసం తానే ద‌ర్శ‌కుడిగా.. నిర్మాత‌గా మారుతున్నాడు. పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రం నిర్మిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. దీనికి మెహ‌బూబా అనే టైటిల్ పెట్టాడు. ఇన్నాళ్లూ రొటీన్ సినిమాలు చేసినా పూరీ.. త‌న‌యుడి కోసం ఇండో పాక్ ల‌వ్ స్టోరీ రాసి తీసుకొస్తున్నాడు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆకాశ్ పూరీ డైలాగ్ డెల‌వ‌రీ కూడా అదిరిపోయింది. లుక్ వైజ్ గా చాలా మెచ్యూరిటీ క‌నిపిస్తుంది. 

త‌న‌యుడి కోసం కూడా మాఫియాను ముట్టుకుంటే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో కానీ క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ కు నిద‌ర్శ‌నంగా ఉండే ఇండో పాక్ క‌థ ప‌ట్టుకొస్తున్నాడు. ఈ మ‌ధ్య పూరీ ఉన్న ఫామ్ కు ఆయ‌న నుంచి అద్భుతాలు ఆశించ‌డం అత్యాశే. కానీ అక్క‌డున్న‌ది కొడుకు క‌దా.. అందుకే పూరీ ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని ఆశించారు అభిమానులు. ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఆ అద్భుతం ఆశించ‌వ‌చ్చు అని అర్థం అవుతుంది. 1971 ఇండో పాక్ వార్ నేఫ‌థ్యంలో సాగే క‌థ ఇది. ఓ ఇండియ‌న్ అబ్బాయి.. పాకిస్థాన్ అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే అంద‌మైన ప్రేమ‌క‌థ మెహ‌బూబా. పంజాబ్, మ‌ధ్య‌ప్రదేశ్, ల‌డ‌క్ లాంటి ప్ర‌దేశాల్లో షూటింగ్ జరుపుకుంది. చాలా ఏళ్ళ త‌ర్వాత సందీప్ చౌతా మ‌ళ్లీ తెలుగులో సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి త‌న‌యుడి సినిమాతో పూరీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలిక‌..! మే 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాడు. 

More Related Stories