English   

పెళ్లి పోస్ట్ పోన్..అంత‌లోనే బ్యూటీకి బంప‌రాఫ‌ర్

Mehreen
2021-06-22 09:19:13

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యాటీ మెహరీన్ కౌర్. ఈ భామ తన అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ఎఫ్ 2 సినిమాలో హనీ క్యారెక్టర్తో నవ్వులు పూయించింది. కెరియర్ ఇలా నడుస్తున్న సమయంలోనే హర్యానా  మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో తన పెళ్లి ఖరారయింది. గత నెలలోనే జరగవలసిన ఈ పెళ్లి కరోనా వల్ల కొంతకాలం వాయిదా పడింది. దీనితో సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆమె డేట్స్ కోసం ఆరాటపడుతున్న ట్లు తెలుస్తుంది.

ఎందుకంటే మెహరీన్ పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.దానిలో భాగంగానే బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య సినిమా కోసం ఇదివరకు శృతిహాసన్, త్రిష పేర్లు వినిపించ‌గా..ప్రస్తుతం మెహరీన్ కు కూడా ఈ సినిమా అవకాశం వచ్చినట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ఆఫర్ కి మెహరీన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా లో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ అధికారి గా కనిపిస్తాడని గుసగుసలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండ‌గా మెహరీన్ ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ లో నటిస్తోంది . కరోనా వల్ల పెళ్లి వాయిదా పడడంతో మారుతి, సంతోష్ ,శోభన్ ల సినిమాలను చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More Related Stories