English   

రాక్ స్టార్ తో మెహ్రీన్ త‌ల్లి..

mehreenkaur

ఒక్క సినిమాతో మ‌ళ్లీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు ర‌ణ్ బీర్ క‌పూర్. సంజూతో పూర్తిగా ఫామ్ లోకి వ‌చ్చేసాడు ఈ కుర్ర హీరో. ఇప్పుడు ఈయ‌న బ్ర‌హ్మ‌స్త్ర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు బ‌ల్గేరియాలో జ‌రుగుతుంది. మ‌న నాగార్జున కూడా అక్క‌డే ఉన్నాడు. ఈ చిత్రంలో ఈయ‌న కేవ‌లం 10 నిమిషాలు మాత్ర‌మే ఉండే అతిథిపాత్ర‌లో న‌టిస్తున్నాడు. 

అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌కుడు. ర‌ణ్ బీర్ క‌పూర్ తో పాటు అలియా భ‌ట్.. అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్ర సెట్స్ లో మెహ్రీన్ కౌర్ అమ్మ ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డే కాసేపు ఉండి ర‌ణ్ బీర్ క‌పూర్ తో ఫోటో దిగింది కూడా. ఈ విష‌యాన్ని మెహ్రీన్ ట్వీట్ చేసింది. రాక్ స్టార్ తో మ‌మ్మీ అంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఎక్కడున్నా రాక్ స్టార్ రాక్ స్టారే.. ఫీలింగ్ హ్యాపీ అంటుంది మెహ్రీన్. అంతేమ‌రి.. ఒక్క హిట్ తీసుకొచ్చే కిక్ ఇక ఇండ‌స్ట్రీలో ఇంకేదీ తీసుకురాదు.

More Related Stories