English   

ఓ పువ్వుతో మ‌రో పువ్వు..

Mehreen Pirzada Viral Photos of Beautiful Smile
2018-08-20 07:37:32

ఈ ఫోటోలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అస‌లు ఇక్క‌డ అమ్మాయి ఉన్న‌ట్లు కాదు.. ఓ పువ్వు మ‌రో పువ్వును న‌వ్వుతూ ప‌ట్టుకుందే అన్న‌ట్లు ఉంది. మెహ్రీన్ స్పీడ్ ఇప్పుడు తెలుగులో కాస్త త‌గ్గింది. వ‌ర‌స సినిమాలు చేసినా విజ‌యాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా మొన్న వ‌చ్చిన పంతం కూడా అంత‌గా ఆడ‌క‌పోవ‌డంతో ఈ బ్యూటీ కెరీర్ కు పెద్ద‌దెబ్బే ప‌డింది. అయితే ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్న మెహ్రీన్.. ఇప్పుడు బ‌రువు త‌గ్గి స్లిమ్ గా మారిపోయింది. ఇప్పుడు విడుద‌లైన పిక్స్ లో అమ్మ‌డి న‌వ్వు చూస్తుంటే అబ్బో రాల్తాయేమో న‌వ‌ర‌త్నాలు అన్న‌ట్లుంది. అంత‌గా మెరిసిపోతుంది ఈ భామ‌. ఈ ఫోటోస్ ఇప్పుడు బాగానే వైర‌ల్ అవుతున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ద్విభాషా చిత్రం నోటాలో ఈమె హీరోయిన్. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న ఎఫ్ 2లోనూ మెహ్రీన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టిస్తుంది ఈ భామ‌. హీరోయిన్ల‌ను రిపీట్ చేసే అల‌వాటు దిల్ రాజుకు బాగా ఉంది. ఓ సారి న‌చ్చితే వ‌ర‌స‌గా అవ‌కాశాలిస్తుంటాడు రాజుగారు. అనిల్ రావిపూడి కూడా గ‌త సినిమా హీరోయిన్ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ఆఫ‌ర్లు ఇస్తుంటాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు సుధీర్ బాబు కొత్త సినిమాలో కూడా ఈ భామే న‌టిస్తుంది. ఇక ఛ‌లో పేమ్ వెంకీ కుడుముల‌తో నితిన్ చేయ‌బోయే సినిమాలోనూ ఈమె హీరోయిన్. వీటితో త‌న కెరీర్ గాడిన ప‌డుతుంద‌ని భావిస్తుంది మెహ్రీన్.

Nehreen Pizada

More Related Stories