English   

నర్తన శాల హీరోయిన్ ఫిక్స్ 

shaurya-mehreen
2018-03-23 18:05:20

ఛలో సూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు నాగ శౌర్య. వరుసగా సినిమా ఒప్పుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శౌర్య చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వీటిలో నర్తన శాల ఒకటి. కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ లతో సక్సస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న మెహ్రీన్ కౌర్ శౌర్యతో రొమాన్స్ చేయబోతోంది. ఈ మేరకు ఈ న్యూస్ అఫీషియల్ గానూ కన్ఫార్మ్ అయింది. ఇటు మెహ్రీన్ కూడా చిన్న పెద్దా హీరోల సరసన ఓకే చెప్పేస్తూ దుమ్మురేపుతోంది. ఆల్రెడీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీకి ఈ మూవీ ఆఫర్ చిన్న విషయమేం కాదు. మెల్లగా స్పీడ్ పెంచుతున్నట్టే అనేదానికి నిదర్శనం ఇది. త్వరలోనే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ కాబోతున్నాయీ యాపిల్ బ్యూటీవి.  

ఛలో ఇచ్చిన కిక్ తో శౌర్యలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అందుకే ఈ మూవీని కూడా తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనే నిర్మిస్తున్నాడు. ఈసారి కూడా ఓ కొత్త దర్శకుడికే చాన్స్ ఇచ్చాడు. చక్రవర్తి అనే దర్శకుడు ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. వచ్చే నెల 12నుంచి నర్తన శాల రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. శౌర్య, మెహ్రీన్ కపుల్ ఆన్ స్క్ర్రీన్ పై ఫ్రెష్ గా కనిపిస్తారనడంలో డౌటే లేదు. నర్తన శాల అనే టైటిల్ వినగానే మనకు పౌరాణిక సినిమా గుర్తొస్తుంది. కానీ ఈ మూవీకి ఆ వాసనలేవీ ఉండవని చెబుతున్నారు. ఇది పూర్తిగా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటున్నారు. మరి నర్తన శాల అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే కానీ తెలియదట. ఏదేమైనా ఈ మధ్య పాత సినిమాల టైటిల్స్ తో వచ్చిన సినిమాల సక్సెస్ రేట్ తక్కువగానే ఉంటోంది. మరి వీళ్లకు ఈ విషయం తెలుసో లేదో.. 

More Related Stories