English   

ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కు హీరోయిన్లు ఫైనల్

Mehrene-Kaur
2018-03-30 17:41:41

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న సినిమా ‘ఎఫ్-2’. అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్. వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమా దర్శకుడు. కమర్షియల్ ఎంటర్టైనర్స్  తో  హిలేరియస్ హిట్స్ కొట్టడం అనిల్ స్టైల్. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన అనిల్ ఈ సినిమాతో మరో కొత్త తరహా కథనం చెప్పబోతున్నాడు. అయితే ఈ మధ్య వెంకటేష్ సినిమా అనగానే హీరోయిన్లతో పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఈ కారణంగా కూడా చాలామంది దర్శకులు వెంకీకి కథ చెప్పలేకపోతున్నారనే టాక్ కూడా ఉంది. కానీ ఇక్కడ డైరెక్టర్ ఫ్యాక్టర్ వర్కవుట్ అయింది. అందుకే వెంకీకి వెంటనే హీరోయిన్ దొరికింది. వరుణ్ కు తన పాత బ్యూటీనే కంటిన్యూ చేస్తున్నాడు వరుణ్. 

ఇంతకీ వెంకటేష్ సరసన నటిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. తమన్నా.. యస్.. వెంకీతో తమన్నా రొమాన్స్ చేయబోతోంది. ఇక వరుణ్ తేజ్ సరసన రాజా ది గ్రేట్ బ్యూటీ మెహ్రీన్ నే తీసుకోవాలనుకుంటున్నాడు అనిల్. సినిమాకు నిర్మాత దిల్ రాజు కాబట్టి మెహ్రీన్ నో చెప్పే ఛాన్స్ లేదు. పైగా అనిల్ తో ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది. సో.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కు హీరోయిన్స్ ఫైనల్ అయినట్టే అనుకోవచ్చు. త్వరలోనే ఓ చిన్న పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ టైమ్ కు ఇద్దరు హీరోయిన్లతో పాటు కీలకమైన ఆర్టిస్టులనూ ప్రకటించబోతోంది యూనిట్. 

More Related Stories